ఆనియన్ బోండా,మైసూర్ బోండా కాదు..సూపర్ టేస్ట్ క్రిస్సీ బనానా బోండా ట్రై చేయండి..ఎన్నైనా తింటూ ఉంటారు!

Posted By:

అరటికాయ తింటే ఆరోగ్యానికి మంచిది అని చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం? అరటికాయతో రకరకాల కూరల వెరైటీలు,స్నాక్స్, జ్యూస్ లు, స్మూతీలు వంటివి తయారుచేయడం మనం తరచూ చూస్తుంటాం. అయితే అరటికాయతో అది కూడా తినే అరటిపండుతో బోండాలు చేస్తే ఎలా ఉంటదో ఎప్పుడైనా ఆలోచించారా? బయట వర్షం పడుతున్నప్పుడు లేదా చలిగా ఉన్న సమయంలో ఈ వేడి వేడి అరటి బోండా తింటుంటే ఆ మజా మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. సూపర్ టేస్టీ,క్రీస్పీగా ఉండే బనానా బోండా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

బనానా బోండా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు

-అరటికాయ
-శెనగపిండి
-ఆయిల్
-కారం
-ఉప్పు
-ఉల్లిపాయ

Unique and Crispy The Ultimate Banana Bonda Recipe in Telugu

బనానా బోండా తయారీ విధానం

-ముందుగా 7 పండు అరటిపండ్లు తీసుకోండి. బాగా పండినవి వద్దు. మీడియంగా పండినవి బెటర్.

-అరటికాయల ఎడ్జ్ లు, చివర పార్ట్ కట్ చేసేయండి. తొక్క తీసేయకూడదు. అరటికాయలను నీళ్లలో వేసి శుభ్రంగా కడగాలి.

-ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉండే బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌ కు తగ్గించి అందులో అరటికాయలను నేరుగా వేసేయాలి. మీడియం మంట మీద 5 నిమిషాలు అరటికాయలను వేయించి బయటకు తీసేయాలి.

-ఫ్రై చేసిన అరటికాయల తొక్కలను తీసేయాలి. చాకుతో తొక్క తీసేసిస అరటికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

-ఇప్పుడు కట్ చేసిన అరటికాయ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 పెద్ద ఉల్లిపాయల సన్నని తరుగు వేసి మొత్తం బాగా కలిసేలా చేతితో మిక్స్ చేయాలి.

-ఇప్పుడు చేత్తో బాగా కలిపిన అరటికాయ మిశ్రమంలో 1 కప్పు శెనగపిండి వేసి కలపాలి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో ఆయిల్ వేడి చేశాక మీడియంలో మంటను ఉంచి కలిపిన మిశ్రమాన్ని బోండాల మాదిరిగా లేదా పకోడీల మాదిరిగా చేత్తో ఆయిల్ లోకి వదలాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వాటిని వేయించి బయటకు తీసేయాలి. అంటే క్రిస్సీ బనానా బోండా రెడీ.

-వేయించిన బోండాలను నూనె పీల్చే టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌ లోకి తీసుకోండి. వేడివేడి బనానా బోండాలను పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ సర్వ్ చేసుకుంటే కేక అంతే.

[ of 5 - Users]
Desktop Bottom Promotion