Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆనియన్ బోండా,మైసూర్ బోండా కాదు..సూపర్ టేస్ట్ క్రిస్సీ బనానా బోండా ట్రై చేయండి..ఎన్నైనా తింటూ ఉంటారు!
అరటికాయ తింటే ఆరోగ్యానికి మంచిది అని చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం? అరటికాయతో రకరకాల కూరల వెరైటీలు,స్నాక్స్, జ్యూస్ లు, స్మూతీలు వంటివి తయారుచేయడం మనం తరచూ చూస్తుంటాం. అయితే అరటికాయతో అది కూడా తినే అరటిపండుతో బోండాలు చేస్తే ఎలా ఉంటదో ఎప్పుడైనా ఆలోచించారా? బయట వర్షం పడుతున్నప్పుడు లేదా చలిగా ఉన్న సమయంలో ఈ వేడి వేడి అరటి బోండా తింటుంటే ఆ మజా మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. సూపర్ టేస్టీ,క్రీస్పీగా ఉండే బనానా బోండా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
బనానా బోండా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు
-అరటికాయ
-శెనగపిండి
-ఆయిల్
-కారం
-ఉప్పు
-ఉల్లిపాయ

బనానా బోండా తయారీ విధానం
-ముందుగా 7 పండు అరటిపండ్లు తీసుకోండి. బాగా పండినవి వద్దు. మీడియంగా పండినవి బెటర్.
-అరటికాయల ఎడ్జ్ లు, చివర పార్ట్ కట్ చేసేయండి. తొక్క తీసేయకూడదు. అరటికాయలను నీళ్లలో వేసి శుభ్రంగా కడగాలి.
-ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉండే బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ కు తగ్గించి అందులో అరటికాయలను నేరుగా వేసేయాలి. మీడియం మంట మీద 5 నిమిషాలు అరటికాయలను వేయించి బయటకు తీసేయాలి.
-ఫ్రై చేసిన అరటికాయల తొక్కలను తీసేయాలి. చాకుతో తొక్క తీసేసిస అరటికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు కట్ చేసిన అరటికాయ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 పెద్ద ఉల్లిపాయల సన్నని తరుగు వేసి మొత్తం బాగా కలిసేలా చేతితో మిక్స్ చేయాలి.
-ఇప్పుడు చేత్తో బాగా కలిపిన అరటికాయ మిశ్రమంలో 1 కప్పు శెనగపిండి వేసి కలపాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో ఆయిల్ వేడి చేశాక మీడియంలో మంటను ఉంచి కలిపిన మిశ్రమాన్ని బోండాల మాదిరిగా లేదా పకోడీల మాదిరిగా చేత్తో ఆయిల్ లోకి వదలాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వాటిని వేయించి బయటకు తీసేయాలి. అంటే క్రిస్సీ బనానా బోండా రెడీ.
-వేయించిన బోండాలను నూనె పీల్చే టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోండి. వేడివేడి బనానా బోండాలను పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ సర్వ్ చేసుకుంటే కేక అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications