Latest Updates
-
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..!
మధురై తణ్ణి చట్నీతో ఇడ్లీ, దోశల టేస్ట్ డబుల్!..ఎలా చేసుకోవాలంటే..
వేడి వేడి ఇడ్లీ, క్రిస్పీ దోశ, లేదా పొంగనాలు.. ఇవి ఏవైనా సరే, వాటికి సరైన జోడీ చట్నీ ఉంటేనే కిక్ వస్తుంది. అయితే ఎప్పుడూ ఒకేలాంటి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలు తిని బోర్ కొట్టిందా? లేదా ఇంట్లో అకస్మాత్తుగా కొబ్బరి అయిపోయిందా? అయితే తమిళనాడులోని మధురై వీధుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఒక స్పెషల్ రెసిపీ తణ్ణి చట్నీ ట్రై చేయండి. తమిళంలో తణ్ణి అంటే నీళ్లు అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఈ చట్నీ కొంచెం పలుచగా, నీళ్లలా ఉంటుంది. కానీ రుచిలో మాత్రం దీనికి సాటి మరొకటి లేదు.

మధురైలో ఉండే చిన్న చిన్న టిఫిన్ సెంటర్లలో లేదా వీధి బండ్లపై ఈ చట్నీని ఒక పెద్ద గిన్నెలో తయారు చేసి, వేడి వేడి ఇడ్లీల మీద ఉదారంగా పోసి ఇస్తుంటారు. ఇడ్లీలు ఈ చట్నీని పీల్చుకుని నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా మారతాయి. మధురై స్పెషల్ తణ్ణి చట్నీ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తణ్ణి చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 8
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం - చిన్న ముక్క
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
పుట్నాల పప్పు (వేపిన శనగపప్పు)- పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - ఒకటిన్నర కప్పులు
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 1
కరివేపాకు - కొద్దిగా
ఉల్లిపాయ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
తణ్ణి చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె కొద్దిగా వేడెక్కాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి వేయించండి. ఇవి మరీ రంగు మారకూడదు.ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడి, లేత గులాబీ రంగులోకి మారితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకోండి. అందులోనే పావు కప్పు పుట్నాల పప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-మెత్తగా రుబ్బుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీలో సుమారుగా ఒకటిన్నర కప్పులు లేదా మీకు కావాల్సినంత పలుచగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ జారుగా ఉంటేనే బాగుంటుంది.
-తాలింపు కోసం చిన్న పాన్ తీసుకుని 1 టీస్పూన్ నూనె వేడి చేయండి. ఆవాలు వేసి చిటపటలాడాక, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. చివరగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించండి.
-గుమగుమలాడే తాలింపును చట్నీలో వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన మధురై తణ్ణి చట్నీ రెడీ. దీన్ని వేడి వేడి ఇడ్లీ, దోశ, లేదా పొంగనాలతో వడ్డించండి. ఇది తాజాగా చేసుకున్న వెంటనే తింటేనే దీని రుచి రెట్టింపు అవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
