Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రెగులర్ ఉప్మా బోర్ కొట్టిందా.. అయితే ఈ బ్రెడ్ ఉప్మాను ట్రై చేయండి..!
ఉప్మా అంటే చాలా మందికి ఇష్టముండదు. అయ్యో ఉప్మానా అని బోర్ గా ఫీల్ అవుతూ వుంటారు. అలాంటి వారికి మేము బ్రెడ్ ఉప్మా రెసిపీని తీసుకొని వచ్చాము. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. తయారు చేసుకోవడం కూడా ఈజీ. బ్రెడ్ ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
బ్రెడ్ ముక్కలు
మంచి నూనె
1 టీస్పూన్ ఆవాలు, ½ టీస్పూన్ జీలకర్ర
⅓ కప్పు తరిగిన ఉల్లిపాయలు
1 పచ్చిమిర్చి, 1 టీస్పూన్ సన్నగా తరిగిన అల్లం
6 నుండి 7 కరివేపాకు ఆకులు
½ కప్పు సన్నగా తరిగిన టొమాటలు
¼ టీస్పూన్ పసుపు, ¼ టీస్పూన్ కారం పొడి,
చిటికెడు ఇంగువ
రుచికి సరిపడ ఉప్పు
ఒక టేబుల్ స్పూన్ కోత్తిమీర
కొన్ని కాజూలు
బ్రెడ్ ఉప్మా ఎలా తయారు చేయాలి
1. బ్రెడ్ ముక్కలను ఒకొక్కటి కట్ చేసుకువాలి . బ్రౌన్ బ్రేడ్ ను మాత్రమే ఉపయోగించాలి..
2. పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి.
3. 1 టీస్పూన్ ఆవాలు, ½ టీస్పూన్ జీలకర్ర వేసి పాప్ రెడీ చేసుకోవాలి.
4. ఎక్కువ మాడిపోకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత ⅓ కప్పు తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి.
6. మీడియం ఫ్లెమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి.
7. 1 పచ్చిమిర్చి, 1 టీస్పూన్ సన్నగా తరిగిన అల్లం, 6 నుండి 7 కరివేపాకు ఆకులను వేసి కలుపుకోవాలి.
8. అల్లం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. దీనికి 10 నుండి 12 సెకన్ల సమయం పడుతుంది.
9. తర్వాత ½ కప్పు సన్నగా తరిగిన టొమాటోలను వేసుకోవాలి.
10. తర్వాత ¼ టీస్పూన్ పసుపు, ¼ టీస్పూన్
కారం పొడి, చిటికెడు ఇంగువ కూడా కావాలంటే వేసుకోవచ్చు.
వీటిని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి.
11. రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి.
12. టమాటలు బాగా ఉడికే విధంగా చూసుకోవాలి లేదంటే పచ్చి వాసన వస్తుంది.
13. ఇప్పుడు దీంట్లో బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి.
14. ఐదు నిమిషాలవరకు ఈ బ్రెడ్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి.
15. ఒక టేబుల్ స్పూన్ కోత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి.
16. మీకు కావాలని అనిపిస్తే ఇందులో కొన్ని కాజూలను వేసుకోవచ్చు. దీంతో రుచితోపాటు మంచి పోషకాలను యాడ్ చేసినట్టవుతుంది.
17. ఇక బ్రెడ్ ఉప్మా రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications