Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఫ్రిజ్ లో పెట్టాల్సిన పనిలేదు..కరిగిపోతుందన్న భయం లేదు..అద్భుతమైన వెనీలా ఐస్ క్రీమ్ బర్ఫీ!
భారతీయ పండుగలు,శుభకార్యాలు స్వీట్లు లేకుండా అసంపూర్ణం. మారుతున్న కాలానికి అనుగుణంగా మన వంటకాలలో కూడా కొత్త రుచులు వచ్చి చేరుతున్నాయి. అందులో ఒకటి వెనీలా ఐస్ క్రీమ్ బర్ఫీ. పేరులో ఐస్ క్రీమ్ ఉన్నప్పటికీ ఇది ఫ్రిజ్లో ఉంచే ఐస్ క్రీమ్ కాదు. కానీ దీని రుచి, ఆకృతి అచ్చం వెనీలా ఐస్ క్రీమ్ లా మృదువుగా, కమ్మగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.
సాధారణంగా బర్ఫీ చేయడానికి కోవా లేదా పాల విరుగుడు అవసరం అవుతుంది. దానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈ వెనీలా ఐస్ క్రీమ్ బర్ఫీని కేవలం 15-20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. వెనీలా ఐస్ క్రీమ్ బర్ఫీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పంచదార: 1 కప్పు (సుమారు 200 గ్రాములు)
ఫ్రెష్ క్రీమ్: 1 కప్పు
పాల పొడి: 2 నుండి 2.5 కప్పులు
వెనీలా ఎసెన్స్: 1 టీస్పూన్
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
డ్రై ఫ్రూట్స్: పిస్తా, బాదం లేదా టూటీ ఫ్రూటీ
యాలకుల పొడి: కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా ఒక ట్రే లేదా ప్లేట్ ను తీసుకుని దానికి కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. బర్ఫీ మిశ్రమం తయారైన వెంటనే ఇందులో పోయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ముందే సిద్ధం చేసుకోవడం ముఖ్యం. బటర్ పేపర్ ఉంటే ప్లేట్ లో వేసుకోవచ్చు, దీనివల్ల బర్ఫీ ముక్కలు సులభంగా వస్తాయి.
-స్టవ్ వెలిగించి ఒక మందపాటి అడుగు ఉన్న కడాయి పెట్టుకోండి. మంటను చాలా తక్కువలో ఉంచండి. ఇప్పుడు కడాయిలో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్, 1 కప్పు పంచదార వేయండి. గరిటెతో తిప్పుతూ పంచదార పూర్తిగా క్రీమ్ లో కరిగేలా చూడండి. పంచదార కరిగే వరకు మరిగిస్తే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు.
-పంచదార పూర్తిగా కరిగిన తర్వాత అందులో రెండున్నర కప్పుల పాల పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపాలి.
-ఇది చిక్కబడి, కడాయి అంచుల నుండి విడిపోవడం మొదలవుతుంది. దీనికి సుమారు 10 నుండి 12 నిమిషాలు పట్టవచ్చు. ఈ సమయంలో 2 స్పూన్ల నెయ్యి వేస్తే బర్ఫీ మరింత రుచిగా, షైనింగ్ గా వస్తుంది.
-మిశ్రమం ముద్దగా మారి, కడాయికి అంటుకోకుండా తిరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేయండి. వెంటనే 1 టీస్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపండి.
-ఈ మిశ్రమాన్ని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలో పోయాలి. గరిటెతో లేదా ఒక చిన్న గిన్నె అడుగు భాగంతో సమానంగా పరచాలి. పైన సన్నగా తరిగిన పిస్తా, బాదం లేదా రంగురంగుల టూటీ ఫ్రూటీ ముక్కలను చల్లి, గరిటెతో కొద్దిగా నొక్కాలి.
-ఈ మిశ్రమాన్ని 3 గంటల పాటు ఆరనివ్వాలి. ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అది గట్టిపడిన తర్వాత , కత్తికి కొంచెం నెయ్యి రాసి మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి. వెనీలా ఐస్ క్రీమ్ బర్ఫీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications