మటన్‌ పాయను కూడా మరిపించే వెజ్‌ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.!

పాయ అంటే ఎవరికైనా సరే మటన్ పాయ గుర్తొస్తుంది. ఇడ్లీలను మటన్‌ పాయతో తింటే వచ్చే మజా వేరు. కానీ పాయ అంటే నాన్‌వెజ్‌ లవర్స్‌ కోసమేనా.. శాకాహారుల కోసం లేదా అని డిసప్పాయింట్‌ కాకండి. వారి కోసం వెజ్‌ పాయ రెడీగా ఉంది. అదే బంగాళాదుంప, పచ్చికొబ్బరితో చేసే టేస్టీ రెసిపీ. చాలా ఈజీగా అయిపోయే వెజ్‌ పాయను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Veg paya with potato and raw coconut paste know the easy process in telugu

వెజ్ పాయ తయారీకి కావాల్సిన పదార్థాలు

గసగసాలు- టీస్పూన్‌
సోంపు గింజలు- టీస్పూన్‌
జీడిపప్పు పలుకులు- ఏడు
పచ్చికొబ్బరి ముక్కలు- కప్పు
నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
మసాలా దినుసులు- టీస్పూన్‌
ఉల్లిపాయలు- రెండు
బంగాళాదుంపలు- రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- టీస్పూన్‌
ఉప్పు- టీస్పూన్‌
నీళ్లు- రెండు కప్పులు
టమాటా- ఒకటి
కొత్తిమీర, పుదీనా ఆకులు- గుప్పెడు

Veg paya with potato and raw coconut paste know the easy process in telugu

వెజ్‌ పాయ తయారీ కోసం ముందుగా బంగాళాదుంపలను కూరలో మాదిరిగా మీడియం సైజులో కట్‌ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి.

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.!

ఇప్పుడు మిక్సీ బౌల్‌ తీసుకుని అందులో గసగసాలు, సోంపు గింజలు, జీడిపప్పుపు, పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్‌ చేసుకోవాలి.

ఇప్పుడు కుక్కర్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల వేసి నూనె కాగిన తర్వాత అందులో మసాలా దినుసులు వేసుకోవాలి.

తర్వాత సన్నగా పొడుగ్గా కట్‌ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత బంగాళాదుంపలు వేసి మొత్తం కలియతిప్పాలి. ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

Veg paya with potato and raw coconut paste know the easy process in telugu

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేవరకు వేగనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి కలపాలి.

ఇప్పుడు పచ్చికొబ్బరి పేస్ట్‌ ముద్ద వేసి కలియ తిప్పి సన్నని మంటపైన ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత కప్పు నీళ్లు పోసి కాసేపు ఉడకనివ్వాలి.

రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్‌.!

తర్వాత చిన్నగా కట్‌ చేసిన టమాటా ముక్కలు వేసి టమాటా మెత్తగా అయ్యేవరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మరో కప్పు నీళ్లు పోసి కలపాలి. కొత్తిమీర, పుదీనా వేసి కలిపి కుక్కర్‌ మూత పెట్టుకోవాలి.

రెండు విజిల్స్‌ వచ్చేవరకు స్టవ్‌పైనే చిన్న మంటపైనే ఉంచాలి. విజిల్స్ పూర్తయ్యాక స్టవ్‌ ఆఫ్‌ చేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్‌ మూత తీయాలి.

టేస్టీ బంగాళాదుంప వెజ్‌ పాయ రెడీ. ఈ వెజ్‌ పాయను బ్రేక్‌ఫాస్ట్‌లో సర్వ్‌ చేసుకోవచ్చు. ఇడ్లీ లేదా పూరీలోకి పర్ఫెక్ట్‌ కాంబినేషన్‌. డిన్నర్‌లోకి చపాతీలోకి తింటే ఆ రుచిని ఎప్పటికీ మరిచిపోలేరు.

[ of 5 - Users]
Story first published: Friday, August 28, 2026, 15:19 [IST]
Desktop Bottom Promotion