For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినాయకునికి ఇష్టమైన అటుకుల రుచులు

|

వినాయక చవితి రోజున గణపతికిష్టమైన ఉండ్రాళ్లూ కుడుములూ... ప్రతి ఇంటా ఉండేవే. మనం ఎక్కువగా బియ్యం పిండితోనే ఇవన్నీ చేస్తుంటాం. వీటినే కొద్ది మార్పులతో రకరకాలుగా చేయవచ్చు. పోషక విలువలు ఎక్కువగా ఉండే రుచికరమైన ఈ వంటకాలు బొజ్జవినాయకుడితో పాటు మనకూ నోరూరిస్తాయి.

అటుకుల పులిహోరా

అటుకుల పులిహోరా

ముందుగా లావు అటుకులను కడిగి నీరు వంపెయ్యాలి.ఒక ఐదునిమిషాలు పక్కన పెడితే మిగిలిన తడికి మెత్తబడి పోతాయి ...

అటుకులు కొబ్బరి కుడుములు

అటుకులు కొబ్బరి కుడుములు

ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, నెయ్యి, జీలకర్ర, పచ్చి సెనగపప్పు, మిరియాలపొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు చల్లి గట్టి ముద్దలా బాగా కలపాలి.

పెరసర గారెలు

పెరసర గారెలు

ముందుగా పెసలు, మినప్పప్పు కడిగి ముందురోజు రాత్రే నానబెట్టి ఉంచాలి. ఉదయాన్నే నీళ్లు వంపేసి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. తగినంత ఉప్పు కూడా కలపాలి.


1. అటుకుల పులిహోరా
కావలసిన పదార్ధాలు:
అటుకులు : 2cups
ఉల్లిపాయ : 1
పచ్చిమిర్చి : 4-6
కరివేపాకు : ఒక రెమ్మ
అల్లం : చిన్న ముక్క
చింతపండుపేస్ట్: రెండు టీ స్పూన్స్
ఉప్పు,నూనె, పసుపు: తగినంత
తాలింపుకు
శనగపప్పు,మినపప్పు,ఆవాలు,పల్లీలు,ఎండుమిర్చి

తయారు చేసే విధానం:
1. ముందుగా లావు అటుకులను కడిగి నీరు వంపెయ్యాలి.ఒక ఐదునిమిషాలు పక్కన పెడితే మిగిలిన తడికి మెత్తబడి పోతాయి .
2. తర్వాత ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం సన్నగా తరగాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి, వేడి చేసి తాలింపు వేసి పల్లీలు బాగా వేగిన తరువాత కరివేపాకు, ఉల్లి ముక్కల మిశ్రమం వేసి చేయించాలి.
4. వెంటనే పసుపు వేసి అటుకులు,తగినంత ఉప్పు,చింతపండు పేస్ట్ అన్నీ వేసి బాగా కలపాలి. అంతే పుల్లపుల్లగా ,కొంచెం కారంగా ఉండే అటుకుల పులిహోర రెడీ.
అటుకుల కుడుములు
కావలసినపదార్థాలు:-

2. అటుకులు కొబ్బరి కుడుములు
అటుకులు: 1/2kg
కొబ్బరికాయ: ఒకటి
పచ్చిసెనగపప్పు(నానబెట్టినవి): 1cup
పచ్చిపాలు: 1/2 ltr
నెయ్యి: 100grms
జీలకర్ర: 2tsp
ఉప్పు: తగినంత
నీళ్లు: తగినన్ని
మిరియాలపొడి: చిటికెడు

తయారుచేయు విధానం:
1. ముందుగా కొబ్బరిని తురమాలి.
2. తర్వాత అటుకుల్ని మిక్సీలో పొడి చేయాలి.
3. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, నెయ్యి, జీలకర్ర, పచ్చి సెనగపప్పు, మిరియాలపొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు చల్లి గట్టి ముద్దలా బాగా కలపాలి.
4. తర్వాత లడ్డూల మాదిరిగా వీటిని ఉండలు చుట్టి కుక్కర్‌లో ఓ విజిల్‌ వచ్చేవరకూ ఉడికించి తీయాలి. అంతే అటుకుల కొబ్బరి కుడుములు రెడీ..

3. పెరసర గారెలు
కావలసినపదార్థాలు:-
పచ్చిపెసలు: 1kg
ఛాయమినప్పప్పు: 1cup
నూనె: తగినంత
పచ్చిమిర్చి: 50grm
అల్లం: అంగుళం ముక్క
జీలకర్ర: tsp
ఉప్పు: రుచికి తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా పెసలు, మినప్పప్పు కడిగి ముందురోజు రాత్రే నానబెట్టి ఉంచాలి. ఉదయాన్నే నీళ్లు వంపేసి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. తగినంత ఉప్పు కూడా కలపాలి.
2. తర్వాత తడిబట్టమీదగానీ లేదా పాలకవర్లమీద గానీ మనకు కావలసిన సైజులో గారెలు వత్తి నూనెలో దోరగా వేయించి తీయాలి.
3. ఎంతో రుచిగా ఉండే ఈ గారెలు మూడు రోజులవరకూ నిల్వ ఉంటాయి.
4. వీటిని అల్లం, వేరుసెనగ, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర... ఏ పచ్చడితో తిన్నా ఇవి రుచిగా ఉంటాయి.

English summary

3 Special Recipes for Vinayaka Chavithi | వినాయకుని ప్రీతి ప్రాయమైన వంటలు


 Ganesh Chaturthi is celebrated to mark the birth of Lord Ganesha. Enjoy some Traditional Ganesh Chaturthi Sweet Recipes . Ganesh Chaturthi is one of the biggest festivals of India and with the celebrations comes the preparation of special recipes.
Story first published: Monday, September 17, 2012, 9:36 [IST]
Desktop Bottom Promotion