For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5నిముషాల్లో అటుకుల పులిహోర : బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

పోహా ఒక డిఫరెంట్ టేస్ట్ లోక్యాలరీలు కలిగి బ్రేక్ ఫాస్ట్ దీన్ని చాలా మంది ఇష్టపడుతారు. ఇది ఉదయం తయారుచేసే సులభమైన అల్పాహర వంట మాత్రమే కాదు,చాలా తక్కువ సమయంలో రుచికరంగా తయారుచేసే బ్రేక్ ఫాస్ట్ కూడా.

పోహాను వివిధ రకాలుగా తయారుచేస్తారు. కొన్ని పోపు దినుసులను జోడించి చాలా ఇష్టంగా మరియు సులభంగా తయారుచేసుకుంటారు. కానీ, చాలా మంది చింతపండును ఉపయోగించి తయారుచేయడం చాలా తక్కువ. ఈ చింతపండు గుజ్జు పుల్లగా వెరైటీ టేస్ట్ కలిగి ఉంటుంది. మరియు మంచి ఫ్లేవర్ ను అందిస్తుంది. ఇది హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కూడా, మరి ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

5-Minute Puli Aval Treat For Breakfast

కావల్సిన పదార్థాలు:
అటుకులుం 1cup
పసుపు: 1/4tsp
చింతపండు గుజ్జు: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
పోపుకోసం అవసరం అయినవి
నూనె: 2tsp
ఆవాలు: 1tsp
ఇంగువ : చిటికెడు
శెనగపప్పు: 2tsp
ఎండుమిర్చి: 2(కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 1(కట్ చేసుకోవాలి)
వేయించిన వేరుశెనగలు: 2-3tbsp
కరివేపాకు: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా అటుకులను శుభ్రంగా కడిగి, నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. వీటికి కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు జోడించి బాగా స్పూన్ తో మిక్స్ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌమీద కడాయి లేదా పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తరవ్ాత అందులో ఇంగువ, శెనగపప్పు, ఎండుమిర్చి, వేరుశెనగలు, ఉప్పు మరియు కరివేపాకు వేసి ఈ మొత్తం మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
4. పోపు వేగిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న అటుకులను వేసి బాగా మిక్స్ చేయాలి. రుచికి సరిపడా ఉప్పు సరిచూసుకొని 3-5నిముషాలు మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. అంతే అటుకుల పులియోగరే (అటుకుల పులిహోర) రెడీ.

English summary

5-Minute Puli Aval Treat For Breakfast

If you are running out of time and need something fast and healthy to prepare this morning, try the yummy puli aval recipe. Also known as beaten rice it is an ingredient which is easily digestible. The healthy aval is also used to prepare other dishes too.
Desktop Bottom Promotion