For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ అమృత్ సరి

|

Aloo Amritsari
బంగాళదుంపలు: 500grm
ఉల్లితరుగు : 2
అల్లంవె ల్లుల్లి పేస్ట్ : 2tsp
వాము : 1/2tsp
ఉప్పు : రుచికి తగినంత
శనగపిండి : 4-5cups
ధనియాలపొడి : 2tsp
మిరప్పొడి: 2tsp
పంజాబి గరంమసాలా: 1tsp
పసుపు: 1/2tsp
పంచదార: 1/2tsp
నూనె : వేయించడానికి సరిపడా
కొత్తిమీర: చిన్న కట్ట

తయారు చేయు విధానము:
1. బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, అల్లంవెల్లుల్లిపేస్ట్, ఉప్పు, వాము, గరంమసాలా వేసి బాగా కలపాలి. బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలిపి పావుగంటసేపు నాననివ్వాలి.
2. తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరవాత ఈ ముక్కలను అందులో వేసి గోధుమరంగువచ్చేవరకు వేయించి తీసేయాలి. తరవాత అదే బాణలిలో ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
3. తరవాత ఉప్పు, పసుపు, మిరప్పొడి, గరంమసాలా, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. తరవాత వేయించి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి మంటను బాగా తగ్గించి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఆలు అమృత్‌ సర్ పరాఠాలలోకి చాలా బావుంటుంది.

English summary

Aloo Amritsari | ఆలూ అమృత్ సరి

Aloo Amritsari using our easy to make Aloo Amritsari recipes. A Punjabi cuisine speciality aloo amritsari or potato vegetable preparation in true Amritsari style is irrestible!
Story first published:Friday, December 16, 2011, 17:46 [IST]
Desktop Bottom Promotion