For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ గ్రీన్ చట్నీ పులావ్ రిసిపి

|

పొటాటో(బంగాళదుంప)ల పులావ్ ఇండియాలో చాలా పాపులర్ రిసిపి. దీన్ని నార్త్ ఇండియన్స్ ఆలూ కా పులావ్ అని కూడా పిలుస్తారు . ఎటువంటి సందేహం లేకుండా ఇది ఒక టేస్టీ డిష్ అంతే కాదు హెల్తీ కూడా . ఆలూ గ్రీన్ చట్నీ పులావ్ కు వివిధ రకాల ఇండియన్ మసాలా దినుసులు జోడించడం వల్ల ఆరోమా వాసనతో నోరూరిస్తుంటుంది.

ఆలూ గ్రీన్ చట్నీ కా పులావ్ ను తయారుచేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. మీకు ఏదైన ఒక మంచి వంట చేయాలనుకొన్నప్పుడు ఇటువంటి సింపుల్ వంటకాలను ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా ఆలూ గ్రీన్ చట్నీ కా పులావ్ రిసిపి పంజాబీయలు ఎక్కువగా వడుతుంటారు. ఈ టేస్టీ ఫుడ్ ను పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ ఆలూ గ్రీన్ చట్నీ కా పులావ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Aloo Green chutney Pulao Recipe

కావల్సిన పదార్థాలు:
నూనె: 2tbsp
బిర్యానీ ఆకు: 1
పెద్దసైజు నల్లని ఇలాచి: 1(పొడిచేసి వేయాలి)
పచ్చిఇలాచి : 4(పొడిచేసి వేయాలి)
లవంగాలు: 4
దాల్చిన చెక్క: 1 అంగుళం
జపత్రి: 1 లేదా 2
ఉల్లిపాలు : 2(సన్నని ముక్కలుగా కట్ చేసుకొన్నవి
ఉడికించి పొట్టు తీసి పొట్టుకొన్న బంగాళదుంపలు 10
పాలకూర పూరీ(పాలకూరను మెత్తగా పేస్ట్ చేసుకన్నది): 4tbsp
గ్రీన్ చట్నీ : 5tbsp
బాస్మతి రైస్: 11/2cup(కడిగి అరగంట పాటు నానబెట్టుకొన్న బాస్మతి రైస్)
నీళ్ళు సరిపడా: 2cups
ఉప్పు : రుచికి తగినంత

1. ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్ది నూనె వేసి వేడి చేసి, అందులో బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి, గ్రీన్ ఇలాచి, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే పాలక్ పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పాలక్ పూరీ పచ్చివాసన పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకొన్న ఆలూ, గ్రీన్ చట్నీ కూడా వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. గ్రీన్ చట్నీ వేగిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకొన్న బియ్యంను అందులో వేసి మొత్తం కలగలిసేలా కలపాలి.
6. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి, మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఆలూ చట్నీ పులార్ రిసిపి రెడీ.

English summary

Aloo Green chutney Pulao Recipe

Aloo Green chutney Pulao Recipe, Aloo pulav filled with herbs is a given treat for those who want to watch their weight. The rich herbs of mint and parsley mixed with the soft boiled potatoes will enhance the taste of the dish. This tasty and healthy herbal aloo pulav is a filling treat.
Story first published: Monday, January 18, 2016, 17:13 [IST]
Desktop Bottom Promotion