For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ పచ్చిబఠానీ కర్రీ : వీకెండ్ స్పెషల్ -వీడియో..!!

By Super Admin
|

ప్రత్యేకమైన వంటలు తయారీ గురించి వెతుకుతూ ఒక్కోసారి మామూలు వంటలని మర్చిపోతుంటారు.ప్రత్యేక వంటలని పందుగలూ, పబ్బాలప్పుడే చేసుకోవాలని మీలో చాలా మంది అనుకుంటారు కదా.కానీ ప్రతీ రోజూ మీ వంటల్లో చిన్న చిన్న మార్పుల ద్వారా బోలెడు రుచి తీసుకురావచ్చు.అలూ మటర్ కూర చాలా ఇళ్ళల్లో సాధారణంగా చేసే కూర.దీనిలో పచ్చి బఠాణీలు మరియూ అలూతో పాటు ఇతర మసాల దినుసులుంటాయి. లంచ్ కావచ్చు లేదా డిన్నర్ కావచ్చు, రైస్ లేదా రోటీ దేనితోనైనా ఈ కూర బాగుంటుంది.

ఈ కూరని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో లాగ చేస్తారు.రాజస్థాన్లో చేసే ఆలూ మటర్ పంజాబ్‌లో చేసే దానికి భిన్నం.మీరు కనుక ఈ కూరని ఎప్పుడూ ప్రయత్నించి ఉండకపోతే కనుక అసలు ఈ కూరకి ఏమేమి కావాలో, దీనిని పంజాబీ స్టైల్లో ఎలా చెయ్యాలో వివరించాము చూడండి.

ఎంత మందికి సరిపోతుంది-4

సామాన్లు సమకూర్చుకోవడానికి-10 నిమిషాలు

వండటానికి పట్టే సమయం-20 నిమిషాలు

కావాల్సిన పదార్ధాలు:

1.నూనె-2 టేబుల్ స్పూన్లు

2.జీలకర్ర-1/2 టీ స్పూను

3.ఉల్లిపాయలు-సన్నగా తరిగినవి 3/4కప్పు

4.వెల్లుల్లి-సన్నగా తరిగినది ఒక టీస్పూను

5.అల్లం- సన్నగా తరిగినది ఒక టీస్పూను

6.పచ్చి కిర్చి పేస్టు-ఒక టీ స్పూను

7.టమాటాలు-సన్నగా తరిగినవి 1 కప్పు

9. పచ్చి బఠాణీ-ఉడికించినవి 1 కప్పు

10. ఆలుగడ్దలు--ఉడికించినవి 1 1/2 కప్పు

11 ఉప్పు-తగినంత

12.కారం-1 1/2 టీ స్పూను

13.గరం మసాల-1/2 టీ స్పూను

14.పసుపు-చిటికెడు

15.కొత్తిమీర-సన్నగా తరిగినది 1 టీ స్పూను

తయారీ విధానం:

1.ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని దానిలో నూనె వేసి వేడి చెయ్యాలి.

Aloo Matar

2.నూనె వేడెక్కాకా దానిలో జీల కర్ర వేసి చిటపటలాడూతుంటే తరిగిన ఉల్లిపాయలు వేసి కలపాలి.

3.ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి వచ్చే వరకూ కలుపుతుండాలి.

Aloo Matar

4.ఇప్పుడు ఉల్లిపాయలకి వెల్లుల్లి, అల్లం,టమాటాలు, పచ్చి మిర్చి పేస్టు వేసి ఒక స్పూను నీళ్ళు కలిపితే టమాటాలు బాగా ఉడుకుతాయి.

5.ఇప్పుడు ఉడికిన టమాటాలని బాగా మెత్తగా అయ్యే వరకూ గరిటెతో మెదిపి, మసాలాలన్నీ బాగా ఉడికాకా దానిలో పచ్చి బఠాణీ మరియూ ఆలుగడ్డ కలపాలి.

Aloo Matar

6.ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.

7.ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసి కూరని బాగా ఉడకనివ్వాలి.

Aloo Matar

8.ఉడికేటప్పుడు ఆలు గడ్డలని మెదిపితే కూర చిక్కబడుతుంది.

9. అంతే మీ ఆలూ మటర్ కూర తయారు.స్టవ్ ఆపి ఈ కూరని ఒక బౌల్లోకి తీసుకోవాలి.

10. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించడమే.

Aloo Matar

ఈ కూర ఎంత సులభమో కదా. ఈ కూర ఎంత రుచిగా ఉంటుందంటే మీరు బ్రెడ్‌తో కూడా దీనిని తినచ్చు.కూరగాయలంటే ఆమడ దూరం పారిపోయే పిల్లలు కూడా ఈ కూరని వేడి అన్నం లేదా రోటీలతో తినడానికి ఇష్టపడతారు.

English summary

Aloo Matar- ( potato peas curry)

Aloo Matar is one of the most common dishes that is prepared in many households. It comprises of peas and potatoes and the curry is made with several spices. Whether at lunch or dinner, with rice or roti, aloo matar can go well at anytime and with anything.
Desktop Bottom Promotion