For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేడి.. వేడి.. ఆలూ పోహా.. పసందైన బ్రేక్ ఫాస్ట్

|

పోహా(అటుకులు)లోఫ్యాట్. ఇవి తినడానికి చప్పగా ఉన్నా, ఆరోగ్యానికి చాలా మంచిది. మన భారతదేశంలో పోహాతో వివిధ రకాల వంటలు తయారు చేసి తింటారు. పోహాను వెజిటేబుల్స్, బంగాళదుంప మిక్స్ చేయడంతో మరింత రుచిగా ఉండటమే కాకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో కడుపునింపేస్తుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. న్యూట్రిషియన్స్ అధికంగా ఉండటం వల్ల ఈ ఆలూ పోహాను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను లేదా సాయంకాలపు స్నాక్ గాను తినవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టమైన ఈ పోహ అంధించడం వల్ల వారి ఎనర్జీ వస్తుంది. మరీ ఈ ఆలూ పోహా ఎలా తయారు చేయాలో చూద్దాం...

Aloo Poha

పోహ(అటుకులు): 2 cups
ఆవాలు: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
పచ్చిమిర్చి: 2 (chopped)
ఉల్లిపాయ: 1 (chopped)
బంగాళదుంప: 1 (cut into small pieces)
వేరుశెనగగింజలు: 10
శెనగపప్పు: 1tsp
నిమ్మరసం: 1tbsp
పసుపు: 1 pinch
కొత్తిమీర: 1 sprig (chopped)
పొడవుగా సన్నగా ఉండే మిక్చర్: 2tbsp
ఉప్పు: as per taste
నూనె: 1tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ స్టౌ మీద పెట్టి నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక నిముషం వేయించాలి.
2. ఒక నిముషం తర్వాత తరిగిన ఉల్లిపాయముక్కలు, వేరుశెనగ గింజలు వేసి వేయించాలి.
3. ఉల్లిపాయ, పల్లీలు వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను, పచ్చిశెనగపప్పు వేసి రెండు మూడు నిముషాలు వేయించాలి.
4. తర్వాత అందులోనే అటుకులను కూడా వేసి బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఐదు నుండి పది నిముషాలు తక్కువ మంట మీద వేయించాలి.
5. తర్వాత అందులోనే పసుపు మరియు నిమ్మరసం, ఉప్పు కూడా వేసి మూత పెట్టి, తక్కువ మంటమీద మరో ఐదు నిముషాలు ఆవిరి మీద ఉడికించి క్రిందికి దింపుకోవాలి.
6. దించిన వెంటనే కొత్తిమీర తరుగు, సన్నని మిక్చర్ తో గార్నిష్ చేసి, వేడివేడిగా వెంటనే తినేయాలి. లేదంటే సాగులా తయారవుతుంది. తినడానికి అంత రుచిగా అనిపించదు.

English summary

Aloo Poha: Filling Breakfast Recipe | పసందైన బ్రేక్ ఫాస్ట్.. ఆలూ పోహా

We Indians love poha as a recipe. We love the recipe because it is easy and quick to make. Poha is a favourite Indian breakfast dish because it has all our favourite spices. So how about adding our favourite vegetable, potatoes to the poha recipe? Aloo poha is a very delicious and filling breakfast idea.
Story first published: Saturday, December 1, 2012, 9:45 [IST]
Desktop Bottom Promotion