For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బనానా ఇడ్లీ-హెల్తీ బ్రేక్ ఫాస్ట్ స్వీట్ ట్రీట్.!

|

పసుపు వర్ణపు స్వీట్ బనానా, చాలా పుష్కలమైన న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీనులను కలిగి ఉంటుంది. వీటిని ఇప్పుడు ఇడ్లీ పిండిలో కలిపి, హాట్ బనానా ఇడ్లీ తయారు చేయవచ్చు. ఈ బనానా ఇడ్లీ పిల్లలకు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్. ఇది పిల్లలకు ఉదయం ఇచ్చేటటువంటి హెల్తీ బ్రేక్ ఫాస్ట్. అలాగే పెద్దలకు కూడా ఆరోగ్యకరమైనది.

బనానా ఇడ్లీ నోరూరించే రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యకరం మరియు పెరిగే పిల్లలకు చాలా మంచి పౌష్టికాహారం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫుల్ న్యూట్రీషియన్, ప్రోటీన్ బ్రెక్ ఫాస్ట్ ను సిద్దం చేయండి..

Banana Idli Recipe For A Breakfast Treat

కావల్సిన పదార్థాలు:
రవ్వ: 1 cup
కొబ్బరి తురుము: 1/4 cup
పండిన అరటి పండ్లు: 3-4 (గుజ్జుగా చేయాలి)
ఉప్పు: ఒక చిటికెడు
చక్కెర / బ్రౌన్ షుగర్ / బెల్లం: 1/2cup(లేదా రుచికి సరిపడా)
బేకింగ్ సోడా: 1/2tsp
నెయ్యి: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా బాగా పండిన అరటి పండ్లను మెత్తగా చిదిమి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్లో చిదిమి పెట్టుకొన్న అరటిపండు గుజ్జు, రవ్వ, కొబ్బరి తురుము, ఉప్పు, పంచదార మరియు బేకింగ్ సోడా, అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు కలపి మిక్స్ చేయడం వల్ల ఇడ్లీ పిండి తయారవుతుంది.
4. తర్వాత ఇడ్లీ ప్లేట్ కు నెయ్యి రాసి, ఇడ్లీ పిండి పోసి, ఇడ్లీకుక్కర్ లో పెట్టి, 15నిముషాల పాటు మీడియం మంట పెట్టి, ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే, వడ్డించడానికి బనానా ఇడ్లీ రెడీ. ఇది ఒక మార్నింగ్ బెస్ట్ స్వీట్ ట్రీట్, పాలతో కలిపి తీసుకోవాలి.

English summary

Banana Idli Recipe For A Breakfast Treat


 The sweet yellow banana, is a highly nutritious fruit rich in proteins. It can now be added to idli batter to make hot banana idlis. This banana idli recipe is every child's favourite since the contents consist of the sweet ripe banana.
Story first published: Friday, July 19, 2013, 11:17 [IST]
Desktop Bottom Promotion