For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెన్సీ రవ్వ చెన్నా(శెనగలు) ఉప్మా

|

Bansi Rava - Channa Upma
ఉప్మా తక్కువ సమయంలో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారము. ఈ ఉప్మాను బియ్యం రవ్వతో, అటుకులతో, సేమ్యాతో లేదా గోధుమ నూకతో చేసుకోవచ్చును. ఇలా ఇంట్లో చేసుకొనే ఉప్మా కొంచెం వెరైటీగా చేస్తే ఎప్పుడూ ఉప్మా తినని వాళ్ళు ఉప్మా అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా టేస్ట్ చూసితీరాల్సింది. చెన్నా, గోధుమరవ్వ, సెమ్యా సరైన పద్ధతిలో చేస్కుంటే చాలా రుచిగా ఉంటుంది మరియూ ఆరోగ్యం కూడా.

ఇందులో ప్రోటీన్లు,కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫైబర్ మరియు కొవ్వు తక్కువ శాతంలో ఉంటుంది. అందుకే ఇది మధుమేహం లేదా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు అన్నానికి బదులుగా గోధుమ రవ్వ ఎక్కువగా వాడుతుంటారు. గోధుమపిండి మాత్రమేకాక గోధుమ రవ్వతో కూడా ఎన్నోరుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:
బెన్సీరవ్వ(లావు రవ్వ): 11/2cup
సేమియా: 1/2cup
చెన్నా(తెల్లని బుడ్డ శెనగలు): 1/2 cup లేదా 1cup
క్యారెట్ తురుము: 1/2cup
పచ్చిమిర్చి: 4-6
ఉల్లిపాయలు: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1(అవసరమైతే వేసుకోవచ్చులేదంటే వద్దు)
నీళ్ళు: 4cup(చెన్నా కూడా ఉడకాలంటే 5cups నీళ్ళు వేసుకోవాలి)
ఉప్పు: రుచికి తగినంత
కొత్తమీర తరుగు: 2tbsp

పోపుకోసం:
నూనె: సరిపడా
ఆవాలు: 1/2tbsp
జీలకర్ర: 1/2tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు

తయారు చేయు విధానం:
1. ముందుగా చెన్నా(తెల్లని బుడ్డ శెనగలను) 3-4గంటల సేపు నానబెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి బెన్సీ రవ్వ(కొద్దిగా లావుగా ఉంటుంది. దీన్నే గోధుమ రవ్వ అని కూడా అంటారు) సేమియాను వేరువేరుగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాతా అదే పాన్ లో ఉప్మాకు సరిపడే నూనెను వేసి, వేడి అయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి వేసి ఫ్రై చేయాలి.
4. ఇప్పడు పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలను, క్యారెట్ తురుమును కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి.
5. అందులోనే ఉప్పు వేసి ఒక సెకను తర్వాత కొలతపెట్టుకొన్న నీటిని పోపులో పోయాలి. అందులోనే ముందుగా నానబెట్టుకొన్నా చెన్నాను వేసి మెత్తగా ఉడకనివ్వాలి.(లేదా చెన్నా సపరేట్ గా ఉడికించుకొని పోపులోనే మిక్స్ చేసుకోవచ్చు).
6. తర్వాత వేయించుకొన్న బెన్సీరవ్వ, సేమియా రెండింటినీ మిక్స్ చేసి మరుగుతున్న నీళ్ళలో పోసి, ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికిందని తెలియగానే స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. దీన్ని కొంచెం లెమన్ పికెల్, పెరుగుతోటి సర్వ్ చేస్తే టేస్టీగా ఉంటుంది.

English summary

Bansi Rava - Channa Upma | హెల్తీ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ చెన్నా ఉప్మా

Upma recipe is a nutritious healthy breakfast recipe. Adding Vermicelli and Chenna is a simple, healthy and nutritious break fast recipe.
Story first published:Friday, August 31, 2012, 8:01 [IST]
Desktop Bottom Promotion