For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీరకాయ పప్పు రుచికరమైన సౌంత్ ఇండియన్ స్పెషల్

|

బీరకాయ...ఇష్టమైన కూరల్లో ఒకటి !! బీరకాయతో భలే భలేగా బోలెడు రకాలు వండుకోవచ్చు. బీరకాయతో పప్పు(ముద్దగానూ, పొడిగానూ కూడా), పచ్చడి, బజ్జీలు, బీరకాయ అట్టు(ఇది చాలా ఇష్టం నాకు), బీరకాయ+మెంతికూర మొదలైనవి. ఇక కూరల సంగతికొస్తే బీరకాయ ఉల్లికారం, బీరకాయ శనగపప్పు కారం, బీరకాయ పోపు కూర, బీరకాయ బంగాళాదుంప మొదలైనవి చేసుకోవచ్చు. ఇవన్నీ అందరికీ తెలుసున్నవే.

అయితే బీరకాయ పప్పును ఈ రోజు మీకు అందిస్తున్నాం. బీరకాయ, పప్పు(పెసరపప్పు లేదా కందిపప్పు)ఈ రెండింటి కాంబినేషన్లో తయారుచేసి ఈ వంట రుచికంగా ఉంటుంది. అంతే కాదు, మంచి పోషకాంశాలున్నా కాంబినేసన్ ఫుడ్ . ఇది చాలా తేలికగా జీర్ణం అవుతుంది మరియు పప్పు అద్భుతమైన కూలింగ్ లక్షణాలు, లో సాచురేట్స్ మరియు లో కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. అంతే కాదు ఇందులో డైటరీ ఫైబర్ కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలనుకొనే వారికి మంచి వెయిట్ లాస్ డైట్ ఫుడ్.

Beerakaya Pappu(Ridge Gourd Dal ): South Special

కావల్సిన పదార్థాలు:
బీరకాయలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
టమొటా: 2
కంది పప్పు: 1cup
పచ్చి మిర్చి: 4సన్నగా కట్ చేసుకోవాలి
చింతపండు రసం: 1/2tsp
పసుపు:1/4tsp
పోపుకోసం :
ఇంగువ: చిటికెడు
మినపప్పు: 1/2tsp
జిలకర్ర: 1/2tsp
ఎండుమిరపకాయలు: 2
కరీవేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమిర: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానము:
1. ముందుగా బీరకాయ చెక్కు తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత పచ్చి మిర్చి, టమోటాలు కూడా చిన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి.
3. ఇప్పుడు కందిపప్పు బాగా కడిగి కుక్కర్ లో పెట్టి ఉడికించాలి.
4. పప్పు ఉడికిన తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో పోపుకోసం సిద్దం చేసుకొన్న పదార్థాలు ఇంగువ, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మీడియం మంట మీద వేయించుకోవాలి.
5. తరువాత అందులో కట్ చేసిన బీరకాయ, టమొటా, పచ్చి మిర్చి ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలి.
6. బీరకాయ బాగా ఉడికిన తర్వాత అందులో ముందుగా ఉడికించిపెట్టుకొన్న కంది పప్పు వేయాలి.
7. తరువాత చింతపండు పులుసు, పసుపు, ఉప్పు వేయాలి.
8.తరువాత మిశ్రమం అంతా బాగా కలిసేలా 5 నిముషాలు ఉడికించాలి.
9. చివరగా కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ గా వేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే బీరకాయ పప్పు రెడీ. ఎంతో రుచిగా ఉండే బీరకాయ పప్పు రెడి. ఇది అన్నం/చపాతి తో బాగుంటుంది.
10.గమనిక: కంది పప్పుతో పాటు బీరకాయ పచ్చి మిర్చి, టమొటా, కూడా ఉడికించుకోవచ్చు.

English summary

Beerakaya Pappu(Ridge Gourd Dal ): South Special

The combination of Ridge Gourd and Moong Dal is ideal as both have high nutritional value and are suitable for maintaining optimum health and weight loss. Ridge Gourd and Moong Dal are made for each other as they are light and aid easy digestion.
Story first published: Wednesday, March 12, 2014, 12:39 [IST]
Desktop Bottom Promotion