For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెండీ కుర్ కురి రిసిపి: సైడ్ డిష్ స్పెషల్ రిసిపి

|

సాధారణంగా చాలా మందికి బెండకాయ తినడం అంటే ఇష్టం ఉండదు. అయితే బెండకాయలను సరైన పద్దతిలో అనుసరించినట్లైతే, బెండకాయలను క్రిస్పిగా తయారుచేయవచ్చు . కుర్ కురి బెండీ రిసిపి, నార్త్ ఇండియాలో చాలా ప్రసిద్ది. ఈ రిసిపికి ప్రధానంగా కావల్సింది, బెండకాయ.

ఈ వంటను తయారుచేయడం చాలా సులభం మరియు త్వరగా తయారవుతుంది. వంటను సైడ్ డిష్ గాను మరియు స్నాక్ గా ను సర్వ్ చేయవచ్చు. మరి ఈ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Bhindi Kurkuri Recipe in Telugu
కావల్సిన పదార్థాలు
బెండకాలు:250grms
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp
పసుపు ½tsp
గరం మసాలా పొడి: ½tsp
జీలకర్ర పొడి: ½
ఛాట్ మసాలా: 1tsp
శనగ పిండి: 3tbsp
కార్న్ ఫ్లోర్: 1tbsp
నూనె: వేయించడానికి సరిపడా
నిమ్మకాయ: 1

తయారుచేయు విధానం:
1. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తర్వాత తుడిచి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక్కో బెండకాయను నిలువుగా, పొడవుగా కట్ చేసుకోవాలి.
3. తర్వాత ఒక వెడల్పాటి బౌల్లో తీసుకొని అందులో బెండకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర, చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.
4. మిక్స్ చేసిన తర్వాత వాటిని 10-15నిముషాలు అలాగే ఉండనివ్వాలి. అందులో నీరు కలపాల్సి అవసరం లేదు. బెండకాయలోనే నీరు ఉంటుంది కాబట్టి, సరిపోతుంది. .
5.ఇప్పుడు అందులో శెనగపిండి మరియు కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు, స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి, నూనె వేసి వేడి చేయాలి.
7. కాగే నూనెలో మ్యారినేట్ చేసి పెట్టుకొన్నబెండకాయలను వేసి, డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ, క్రిస్పీగా ఎక్కువ మంట పెట్టి వేయించుకోవాలి. 8. ప్లేట్ లోనికి తీసుకొన్న తర్వాత నిమ్మరసం చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే కుర్ కిరి బేడి రెడీ..

Story first published: Wednesday, November 25, 2015, 13:37 [IST]
Desktop Bottom Promotion