For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ అండ్ టేస్టీ బ్రొకోలీ కోకనట్ కర్రీ

|

చూడటానికి కాలీఫ్లవర్‌లా కన్పించినా ఆకుపచ్చ అందం సంతరించుకున్న పువ్వుకూర ‘బ్రొకొలి'. ఇప్పుడు అన్ని సూపర్‌మార్కెట్లలోనూ మిగతా కూరగాయలతో పాటు దొరుకుతోంది. ఎన్నో పోషక విలువలున్న బ్రొకొలిని సలాడ్, సూప్స్‌లే కాక కూరగా కూడా చేసుకోవచ్చు.

ఈ ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన వెజిటేబుల్ బ్రొకోలి. గ్రీన్ వెజిటేబుల్స్ లో ఎక్కువ న్యూట్రీషియన్స్ కలిగినటువంటి వెజిటేబుల్ ఇది . ఈ బ్రొకోలి వెజిటేబుల్లోని ఆరోగ్యప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో పోషక తత్వాలు విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం.

Brocoli -Coconut Curry: Telugu Vantalu

ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లో విటమిన్ సి మరియు బి5 అధికంగా ఉన్నాయి. బ్రొకోలీలో చాలా శక్తివంతమైన న్యూట్రీషియన్స్ కలిగి ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. మరి రెగ్యులర్ డైట్ లో ఏవిధంగా చేర్చుకోవాలంటే మీ ఇష్టం వచ్చినట్లు సలాడ్స్, కర్రీస్, ఫ్రైల రూపంలో ఉపయోగించుకొని ఆరగించడమే. మరి ఈ రోజు మీకోసం బ్రొకోలీతో తయారుచేసే ఒక స్పెషల్ వంట...

Brocoli -Coconut Curry: Telugu Vantalu

కావలసిన పదార్థాలు:
బ్రొకొలి - 2 పువ్వులు,
ధనియాలు - 1tps
కొత్తిమీర - 1 కట్ట
కొబ్బరి తురుము- 1/2cup
కరివేపాకు - 2 రెబ్బలు
పచ్చిమిర్చి - 4-6
ఎండుమిర్చి - 4
జీడిపప్పులు - 8-10
ఉప్పు - రుచికి సరిపడా
పోపుకోసం కావల్సిన పదార్థాలు:
మినపప్పు, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున
ఇంగువ - చిటికెడు
నూనె - సరిపడా

Brocoli -Coconut Curry: Telugu Vantalu

తయారు చేయు విధానం:
1. ముందుగా బ్రొకోలిని ముక్కలుగా తరిగి ఆవిరిపైన 3 నిమిషాలు ఉడికించాలి.
2. తర్వాత పాన్ లో ధనియాలు, కొత్తిమీర, కొబ్బరి తురుము వేగించి, చల్లార్చి జీడిపప్పుతో పాటు (కొద్ది నీరు కలిపి) మెత్తగా రుబ్బుకోవాలి.
3. మసాలాను సిద్దం చేసుకొన్న తర్వాత పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో పోపుకోసం సిద్దం చేసుకొన్న వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి.

Brocoli -Coconut Curry: Telugu Vantalu


4. పోపు వేగిన తర్వాత అందులోనే ముందుగా ఆవిరి మీద ఉడికించుకొన్నబ్రొకొలి ముక్కలు వేయాలి.
5. బ్రోకోలీ కూడా మసాలాతో పాటు రెండు నిమిషాలు వేగిన తర్వాత మసాలా పేస్టు కలిపి సన్నని మంటపై ఫ్రై చేసుకోవాలి.
6. గ్రేవీ చిక్కగానే మారినప్పుడు స్టౌ ఆఫ్ చేసి దింపుకోవడమే ఆలస్యం...వేడి వేడి అన్నం, చపాతీలలోనికి మంచి కాంబినేషన్.

English summary

Brocoli -Coconut Curry: Telugu Vantalu

Broccoli is one of the healthiest vegetables in the world and also amongst the healthiest foods on the planet owing to its rich nutrient composition. Do you know how to prepare broccoli coconut curry at home easily? Check out and give it a try...
Story first published: Tuesday, October 13, 2015, 13:17 [IST]
Desktop Bottom Promotion