For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ బట్టర్ మిల్క్ సాంబార్ రిసిపి

|

మజ్జిగ పులుసు(బట్టర్ మిల్క్ సూప్) ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్పెషల్ రిసిపి. కమ్మగా మరియు కొంచెం పుల్లగా ఉండే ఈ మజ్జిగ పులుసు రైస్ కు ఒక బెస్ట్ కాంబినేషన్. ముఖ్యంగా మజ్జిగ పులుసు ఆంధ్రాలో చాలా ఫేమస్ అయినటువంటి వంట ఇది. రుచికరంగా, కమ్మగా ఉండే ఈ హెల్తీ డిష్, శరీరానికి చలువ చేస్తుంది. రుచిమాత్రమే కాదు మంచి ఫ్లేవర్, రంగు కూడా ఉంటుంది.

మజ్జిగ పులుసు(బట్టర్ మిల్క్ సూప్) ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్పెషల్ రిసిపి. కమ్మగా మరియు కొంచెం పుల్లగా ఉండే ఈ మజ్జిగ పులుసు రైస్ కు ఒక బెస్ట్ కాంబినేషన్. ముఖ్యంగా మజ్జిగ పులుసు ఆంధ్రాలో చాలా ఫేమస్ అయినటువంటి వంట ఇది. రుచికరంగా, కమ్మగా ఉండే ఈ హెల్తీ డిష్, శరీరానికి చలువ చేస్తుంది. రుచిమాత్రమే కాదు మంచి ఫ్లేవర్, రంగు కూడా ఉంటుంది.

Buttermilk Sambar Recipe With Veggies

కావల్సిన పదార్థాలు:
తెల్ల గుమ్మడికాయ ముక్కలు: 2cups(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
శెనగపప్పు: 2 ½tbsp
పచ్చిమిర్చి: 3 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొబ్బరి తురుము: ½cup
అల్లం : చిన్న ముక్క
ధనియాలు : 1 ½ tsp
కొత్తిమిర : కొద్దిగా (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఆవాలు: 1 tsp
జీలకర్ర : ½ tsp
హింగ్ : ¼ tsp
పసుపు : ¼ tsp
పెరుగు: 1cup
నీళ్ళు: 2cups
ఉప్పు: రుచికి సరిపడా

పోపుకోసం కావల్సినవి:
నూనె : 2tsp
ఆవాలు :1/2 tsp
ఎండు మిర్చి: 2
కరివేపాకు:రెండు రెమ్మలు

తయారుచేయు విధానం:
1. శెనగపప్పును నీటిలో వేసి కొద్దిసోపునానబెట్టుకోవాలి.
2. తర్వాత తెల్ల గుమ్మడికాయను శుభ్రం చేసి లోపలి విత్తనాలు తొలగించాలి.
3. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో 2కప్పుల నీళ్ళు పోయాలి . మీడియం మంట మీద నీరు వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు మరియు గుమ్మడి ముక్కలు వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.
4. తర్వాత ఒక కప్పు పెరుగులో కొద్దిగా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.
5. ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టుకొన్న శెనగపప్పు, కొబ్బరి తురుము మరియు ఆవాలు, జీలకర్ర మరియు జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత అందులో కొత్తిమీర, పసుపు, అల్లం, ఇంగువ వేసి మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. ఇప్పుడు గుమ్మడి ముక్కలు మెత్తగా ఉడికించుకొని, నీరు వంపేసుకోవాలి .
7. ఉడికించుకొన్న గుమ్మడి ముక్కల్లో మీక్సీలో గ్రైండ్ చేసుకొన్న మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేసి, స్టౌ మీద పెట్టి, తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
8. 10 నిముషాల తర్వాత అందులో చిక్కటి పెరుగు, అవసరం అయితే కొద్దిగా నీళ్ళు మరియు ఉప్పు మిక్స్ చేయాలి .
9. ఇప్పుడు మరో పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో పోపుకోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నీ వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
10. పోపు వేగిన తర్వాత అందులో పెరుగు గుమ్మడి ఉడించుకొన్న సాంబార్ ను పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత సర్వ్ చేయాలి. అంతే వెజిటేబుల్ బట్టర్ మిల్క్ సాంబార్ రెడీ...

Story first published: Wednesday, February 18, 2015, 18:03 [IST]
Desktop Bottom Promotion