For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాబేజ్ కట్ లెట్ -హెల్తీ బ్రేక్ ఫాస్ట్

|

రోజూ తిన్న అల్పాహారాలే తిని..తిని బోరుకొడుతుందా...ఏదైనా వెరైటీగా బ్రేక్ ఫాస్ట్ తినాలినిపిస్తోందా?మరి మా వద్ద ఒక ఫర్ ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి ఉంది. మీరు కూడా ప్రయత్నించి ఎంజాయ్ చేయవచ్చు . మీరు వివిధ రకాల కట్ లెట్స్ ను ప్రయత్నించి ఉండవచ్చు . అయితే క్యాబేజ్ కట్ లెట్ రుచి చూశారా?

క్యాబేజ్ కట్ లెట్ బ్రేక్ ఫాస్ట్ కు గ్రేట్ ఆప్షన్. ఇంట్లో పిల్లలు కనుక ఉంటే వారు వెజిటేబుల్స్ తినకుండా మారం చేస్తున్నట్లైతే ఇది ఒక మంచి పద్దతి. ఈ విధంగా తయారు చేసి వారి ప్లేట్లలో పెడితే హ్యాపీగా తినేస్తారు. పిల్లలకు ఈవిధంగా వెజ్ ఫుడ్ తినిపించడానికి ఒక మంచి పద్దతి. ఇది చాలా సులభమైన వంటకం. అన్ని ఇట్లో సాధారణంగా ఉపయోగించే వస్తువులే కాబట్టి శ్రమపడాల్సిన పనిలేదు. కాబట్టి క్యాబేజ్ కట్ లెట్ ను బ్రేక్ ఫాస్ట్ రిసిపికి తయారు చేసి సర్వ్ చేయండి..

Cabbage Cutlet For Breakfast

కావల్సిన పదార్థాలు:
క్యాబేజ్: 1cup(తరిగిపెట్టుకోవాలి)
బంగాళదుంప: 2(ఉడికించి చిదిమి పక్కన పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2(కట్ చేసుకోవాలి)
కరివేపాకు : రెండు రెబ్బలు(సన్నగా తరుగుకోవాలి)
కొత్తిమీర తరుగు: 2tbsp(సన్నగా తరుగుకోవాలి)
ఛాట్ మసాలా: 1tsp
మైదా: 2tbsp
బ్రెడ్ పొడి: 1/2cup
నూనె: డీప్ ఫ్రై చేయడానికి
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 1/2cup

తయారు చేయు విధానం:
1. క్యాబేజ్ తరుగు, ఉడికించి పెట్టుకొన్ని బంగాళదుంప, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు మరియు చాట్ మసాలా అన్నింటిని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని కలగలిసేలా మిక్స్ చేయాలి.
2. తర్వాత ఈ మిశ్రమాన్ని మీడియం సైజ్ బాల్స్ గా రౌండ్ గా చుట్టుకోవాలి. తర్వాత ఈ క్యాబేజ్ పొటాటో బాల్ ను అరచేతిలో పెట్టుకొని కట్ లెట్ లా ప్రెస్ చేసుకోవాలి.
3. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసి, మైదా వేసి కొంచెం జారుడగా కలుపుకోవాలి.
4. ఇప్పుడు కట్ లెట్ ను ఈ మైదామిశ్రమంలో డిప్ చేసి అన్నివైపులా మైదా అంటేలే చూసుకోవాలి.
5. తర్వాత ఒక ప్లేట్ మీద బ్రెడ్ పొడి వేసి మైదాలో డిప్ చేసిన కట్ లెట్ ను బ్రెడ్ పొడిలో రెండు వైపులా అద్దాలి.
6. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె పోసి స్టౌ మీద పెట్టి నూనె వేడయ్యాక అందులో బ్రెడ్ పొడిలో అద్దిపెట్టుకొన్న కట్ లెట్ ను వేసి 10నిముషాల పాటు, మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే కట్ లెట్ బ్రౌన్ కలర్ లో మారగానే సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని వేడి వేడిగా పుదీనా చట్నీ లేదా టమోటో కెచప్ తో సర్వ్ చేయాలి.

English summary

Cabbage Cutlet For Breakfast | క్యాబేజ్ కట్ లెట్ -హెల్తీ బ్రేక్ ఫాస్ట్

Are you in a mood to try something new for breakfast? Then we have a perfect breakfast recipe for you. You must have heard of various kinds of cutlets. Ever heard of cabbage cutlet?
Story first published: Tuesday, May 28, 2013, 10:40 [IST]
Desktop Bottom Promotion