For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరమైన క్యాబేజ్ రవ్వ ఉప్మా

|

రోజులో అతి ముఖ్యమైనది బ్రేక్ ఫాస్ట్. రోజంతా శక్తిగా, బలంగా, ఉత్సాహాంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. కాబట్టి, మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తో మీ దినచర్యను ప్రారంభించండి. ఆరోగ్యకరమైన కూరగాయలను ఉపయోగించి బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసుకోవడం వల్ల రుచికరంగాను మరియు శరీరానికి అవసరం అయ్యే పోషకాలు కూడా ఉంటాయి. క్యాబేజ్ ఆరోగ్యకరమైన గ్రీన్ లీఫీ వెజిటేబుల్. ఇందులో ఫొల్లెట్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరం. కాబట్టి, మీ ఇంట్లో ఎవరైన గర్భణీ స్త్రీలున్నప్పుడు ఇది ఒక బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి.

ఈ వంటలో మరో ప్రధానమైన వస్తువు, రవ్వ. రవ్వలో విటమిన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం అయ్యే పోషకాంశాలు కాబట్టి, క్యాబేజ్ రవ్వ ఉప్మా గర్భిణీలకు ఆరోగ్యకరమైనది. మరి, రవ్వ, క్యాబేజ్ తో మరింత టేస్టీగా ఉప్మా తయారు చేసుకోవాలనుకుంటే, ఎలా తయారు చేయాలో చూద్దాం రండీ...

Cabbage Rava Upma

కావల్సిన పదార్థాలు:
రవ్వ : 2cups
ఆవాలు : ½tbsp
జీలకర్ర : ½tbsp
ఉద్దిపప్పు : ½tbsp
చనా దళ్ : ½tbsp
ఎండుమిర్చి : 3 nos
కరివేపాకు : 3రెమ్మలు
క్యాబేజీ : ½cup(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
వెల్లుల్లి మరియు అల్లం పేస్ట్: 1tbsp
జీడిపప్పు : 20 గ్రాముల(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
ఆయిల్ : 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడిచేయాలి, అందులో రవ్వ వేసి 5 నిముషాలు వేగించుకొని, ఒక ప్లేట్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో మరికొంత నూనె వేసి, వేడయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత అందులో కరివేపాకు వేసి ఒక సెకను వేగించాలి.
3. తర్వాత వెంటనే అందులో ఉద్దిపప్పు, ఎండుమిర్చి, మరియు శెనగబాళ్ళు వేసి మరో నిముషం వేగించుకోవాలి. లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించాలి.
4. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులో క్యాబేజ్ తురుము లేదా చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాబేజ్ ను వేసి 5నిముషాలు వేగించుకోవాలి. మసాల అంతా కలగలిసేలా వేగించాలి.
6. తర్వాత అందులో జీడిపప్పు కూడా వేసి ఒక నిముషం తర్వాత సరిపడా నీళ్ళు పోసి, బాగా మరిగించాలి.
7. మసాలాతోపాటు క్యాబేజ్ మిశ్రంతో మరుగుతున్న నీటిలో ముందుగా వేగించి పెట్టుకొన్న రవ్వను వేసి, బాగా మిక్స్ చేస్తూ ఉడికించాలి.
8. మొదట మంట ఎక్కువ పెట్టుకొన్నా, రవ్వ చిక్కుబడుతున్నప్పుడు, మంటను మీడియంకు తగ్గించి ఉడికించుకోవాలి.
9. మిశ్రమం అంతా 10 నిముషాలు బాగా ఉడికిన తర్వాత, పూర్తిగా మంట తగ్గించి, మరో ఐదు నిముషాలు అలాగే ఆవిరి మీద పెట్టాలి. అంతే స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే క్యాబేజ్ ఉప్మా రెడీ. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

English summary

Cabbage Rava Upma Recipe For Pregnant Women

The most important meal of the day is your breakfast. Therefore, to make a healthy start you should have a good breakfast which consists of healthy vegetables and other ingredients. Cabbage is a healthy vegetable which is rich source of follates which is beneficial for pregnant women.
Story first published: Friday, September 13, 2013, 12:29 [IST]
Desktop Bottom Promotion