For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాప్సికమ్ గ్రీన్ పీస్, పన్నీర్ గ్రేవీ: టేస్టీ అండ్ క్రీమీ

|

పన్నీరును మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పన్నీర్ తో తయారు చేసే వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. పన్నీర్ తో తయారు చేసే వంటలు, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో వివిధ వెరైటీలను సర్వ చేస్తారు. పన్నీర్ తో కర్రీలు, వేపుళ్ళు, సలాడ్స్, సాండ్విచ్ లు మాత్రమే కాకుండా స్నాక్స్ కూడా తయారు చేస్తారు.

ఇక పచ్చిబఠానీతో తయారు చేసే వంటలు చాలా పాపులర్ వంటకాలు. పచ్చిబఠానీలు, పన్నీర్ కాంబినేషన్, గ్రేవీ మసాలా చాలా టేస్ట్ గా ఉంటుంది. అందులో క్రిస్పీగా వేయించిన పన్నీర్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడ పన్నీర్ తో కొత్త వంటను రుచి చూడాలనుకుంటే ఈ వంటను ట్రై చేయండి.

Capsicum Green Peas Paneer Gravy: Telugu Vantalu

కావల్సిన పదార్థాలు:
గ్రీన్ పీస్: 2 cup
పన్నీర్: 200 gms
కొబ్బరి - 1 cup
క్యాప్సికమ్ - 1 cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1tbsp
కారం - 3 to 4
పచ్చిమిర్చి - 3 to 4
ధనియాలపొడి - 1 tbsp
బట్టర్ - 2 tbsp
దాల్చిన చెక్క - 1 stick
గసగసాలు - 2 tbsp
జీడిపప్పు- 10 to 12
ఉప్పు రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్లో నీళ్ళు పోసి పచ్చిబఠానీలు వేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత మిక్సీ జార్ లో , కొబ్బరి, జీడిపప్పు, దాల్చిన చెక్క, గసగసాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మరియు నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. పాన్ లో బట్టర్ వేసి కాగిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన క్యాప్సికమ్, ధనియాపౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులో పచ్చిబఠానీలు మరియు మసాలా పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
6. మసాలా వేగిన తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అంతే గ్రీన్ పీస్ పన్నీర్ గ్రేవీ రెడ.
7. ఇది చపాతీ మరియు రోటీలకు చాల అద్భుతమైన టేస్ట్ ను ఇస్తుంది.

English summary

Capsicum Green Peas Paneer Gravy: Telugu Vantalu

Paneer is one of the rich sources of protein. There are variety of dishes that are cooked using paneer. One of the best dishes that can be made from paneer is, green peas-paneer gravy. It's the most mouth watering dish ever.
Story first published: Friday, August 14, 2015, 11:52 [IST]
Desktop Bottom Promotion