For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన క్యాప్సికమ్ మసాలా రైస్

|

Capsicum Masala Rice
కావలసిన పదార్ధాలు:
అన్నం: 3 cups
ఆయిల్: 1 tbsp
నెయ్యి:1 tbsp
ఆవాలు: 1 tsp
కరివేపాకు: 2 రెమ్మలు
క్యాప్సికమ్: 2 (చిన్న చిన్న గా కట్ చేసి పెట్టుకొన్నవి)
ఉప్పు: రుచికి తగినంత
పచ్చికొబ్బరి తురుము: 1 tbsp
వేరుశనగపప్పు: 1 tbsp

పొడి చేయడం కోసం:
ఎండుమిర్చి: 3
ధనియాలు: 1 tbsp
జిలకర్ర: 1/2 tsp
మినప్పప్పు: 1 tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
వేరుశనగపప్పు: 2 tbsp
నెయ్యి: 11 tsp

తయారు చేయు విధానము:
1. పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక జిలకర్ర, మినప్పప్పు వేయించాలి ఇందులో ధనియాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కలపాలి, తర్వాత పల్లీలు వేసి వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి.
2. వేడి వేడి అన్నంలో ఈ పొడి మిశ్రమాన్ని కలపాలి.
3. అదే పాన్ లో ఆయిల్ లేద నెయ్యి వేసి వేడయ్యాక అవాలు చిటపటలాడాక, కరివేపాకు వేసి కలపాలి.
4. క్యాప్సికమ్ ముక్కలు వేసి మూడు, నాలుగు నిమిషాలపాటు వేయించాలి. తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇందులో కొబ్బరిపొడి, వేయించిన పల్లీలు, మసాలా పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలపాలి అంతే క్యాప్సికమ్ మసాల రైస్ రెడీ. దీనిని ఏదైనా గ్రేవీ కర్రీ లేదంటే ఉరగాయ, పెరుగు కాంబినేషన్ తో క్యాప్పికమ్ రైస్ ని వడ్డించాలి.

Story first published:Monday, March 1, 2010, 14:21 [IST]
Desktop Bottom Promotion