For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్ సూప్ రిసిపి: వింటర్ స్పెషల్

|

వింటర్ సీజన్ లో చలిని తట్టుకోవాలన్నా, సీజన్ ను ఎంజాయ్ చేయాలన్నా వేడి వేడి, కారం కారంగా ఏదైనా సూప్ త్రాగితే ఎలా ఉంటుంది?అంతే కాదు, ఈ సూప్ వింటర్ చలిని తగ్గించడం మాత్రమే కాదు, ఈ సీజన్ లో వచ్చే కొన్ని చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలను నివారిస్తుంది. దగ్గు, జలుబు వంటి వాటిని నుండి ఉపశమనం పొందేలా చేస్తాయి. ఈ సూపుల తయారీకి ఉపయోగించే కొన్ని మసాలాలు(పెప్పర్, పసుపు, అల్లం, వెల్లుల్లి)వంటివి చాలా త్వరగా కోలుకొనేలా చేస్తాయి.

ఇది హెల్తీ మరియు పొట్టనింపి రిసిపి. అంతే కాదు, మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఈ సీజన్ లో మనకు అన్ని రకాల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చిన వెజిటేబుల్ తో డిఫరెంట్ ఫ్లేవర్ తో మనం తయారుచేసుకొని వింటర్ చలిని ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ హెల్తీ క్యారెట్ సూప్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Carrot Soup Recipe To Fight Winter Chills

కావల్సిన పదార్థాలు:
క్యారెంట్స్ : 5-7
టమోటో: 2tbsp(ఒక టమోటోను గుజ్జుగా తయారుచేసుకోవాలి)
బ్లాక్ పెప్పర్ పౌడర్: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
గరం మసాలా
బటర్
కొత్తిమీర: గార్నిషింగ్ కోసం

తయారుచేయు విధానం:
1. ముందుగా క్యారెట్ మీ పొట్టు తొలగించాలి. ఇప్పుడు క్యారెట్స్ ను తురిమి, ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక బౌల్లో క్యారెట్ తురుము మరియు టమోటోను వేసి కొద్దిగా నీళ్ళు పోసి, మెత్తగా ఉడికించి తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. తర్వాత పాన్ లో బటర్ వేసి కరిగిన తర్వాత అందులో అల్లం మరియు టమోటో,క్యారెట్ పేస్ట్ కూడా ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉప్పు, గరం మసాలా, కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఒక నిముషం ఉడికించి, తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత దీన్ని సూప్ బౌల్లోనికి మార్చుకొని, బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే వింటర్ స్పెషల్ క్యారెట్ సూప్ రెడీ...

English summary

Carrot Soup Recipe To Fight Winter Chills!


 Winter is the season to enjoy a sip of hot soup in the evening and fight the cold winds. Soups are healthy and filling snacks which can be made easily too! During winter, you get ample of vegetables to make healthy soup of different flavours.
Story first published: Wednesday, January 8, 2014, 17:07 [IST]
Desktop Bottom Promotion