For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శెనగల కర్రీ: హిమాచల్ ప్రదేశ్ స్పెషల్

|

మన ఇండియన్ కుషన్స్ లో వివిధ రకాల వంటలు నోరూరిస్తుంటాయి. అద్భుతమైన రుచిగల వంటలు ఒకటి కాదు రెండు కాదు, చెప్పడానికి వీలులేనన్ని ఉంటాయి. మన ఇండియాలో ఆయా ప్రదేశాల్లో, ఆయా స్టేట్స్ లో ప్రత్యేకమైన వంటలుంటాయి. అటువంటి రుచికరమైన వంటల్లో హిమాచల్ ప్రదేశ్ యొక్క వంటలకు కూడా ప్రత్యేకత ఉంది.

మద్ర అనేది బేసిక్ గా గ్రేవీ. దీన్ని పెరుగుతో తయారుచేస్తారు. ఇది పాపులర్ పహాడి డిష్. దీన్ని శెనగలు మరియు ఇతర గింజలతో తయారుచేస్తారు . మద్ర చాలా సింపుల్ డిష్. అయితే రుచి మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇది రైస్ మరియు చపాతీలకు చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఈ ఫర్ ఫెక్ట్ వెజిటేరియన్ డిష్ ను మీరు కూడా ట్రై చేయవచ్చు.

Chana Madra Recipe From Himachal Pradesh

కావల్సిన పదార్థాలు

చిక్పీస్ (కాబూలి చనా/కాబూలిశెనగలు): 3cups
పెరుగు: 2cups
హింగ్(ఇంగువ): చిటికెడు
లవంగాలు: 2-3
దాల్చిన చెక్క: 1
బ్లాక్ యాలకులు : 2
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకులు: 2
సోంపుగింజలు(saunf): 1tsp
పసుపు: 1tsp
ధనియాల పొడి: 2tsp
పంచదార: ½ tsp
ఉప్పు: రుచికి సరిపడా
డ్రై ఫ్రూట్స్: 2tbsp(అన్నింటిని తరిగి పెట్టుకోవాలి)
నెయ్యి 4tbsp

తయారుచేయు విధానం:

1. కాబూళీ శెనగలను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టాలి.
2. తర్వాత మరుసటి రోజు శెనగలు శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి, కొద్దిగా ఉప్పు వేసి 2-3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. ఒకసారి ఉడికిన తర్వాత అదనపు నీళ్ళను గిన్నెలోకి వంపి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో ఇంగువ, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క,సోంపు, బ్లాక్ యాలకులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒకనిముషం వేగించుకోవాలి.
5. తర్వాత అందులోనే పసుపు, ధనియాల పొడి వేసి కొన్ని సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత ఒక గిన్నెలో పెరుగు మరియు పంచదార వేసి వేసి స్పూన్ తో బాగా గిలకొట్టాలి. తర్వాత ఈ మిశ్రామాన్ని పోపు వేగుతున్న పాన్ లో పోయాలి.
7. తర్వాత మంటను తగ్గించి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి.
8. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న శెనగలు, రుచికి సరిపడా ఉప్పు మరియు డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
9. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత 10నిముషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. అంతే రుచికరమైన చెనా మద్ర రిసిపి రెడీ. ఇది చపాతీ మరియు అన్నంకు చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Chana Madra Recipe From Himachal Pradesh

Indian cuisine is a combination of so many different varieties of food. Every region of the country has its own special food which makes the cuisine of the place unique in itself. So, today we have a special dish from the beautiful and cold state of Himachal Pradesh.
Story first published: Thursday, May 29, 2014, 12:20 [IST]
Desktop Bottom Promotion