For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెట్టినాడ్ బీన్స్ కాలీఫ్లవర్ ఫ్రై

చెట్టినాడ్ బీన్స్ కాలీఫ్లవర్ ఫ్రై

|

ఈ రోజు భోజనానికి సైడ్ డిష్ గా ఏమి వేయించాలో ఒక్కోక్కసారి ఖచ్చితంగా మనకు తెలియదు? మీ ఇంట్లో బీన్స్ మరియు కాలీఫ్లవర్ ఉన్నాయా? అప్పుడు మీరు ఈ రెండు కూరగాయలను రుచికరమైన విధంగా వేయించవచ్చు. మీరు చెట్టినాడ్ స్టైల్‌లో బీన్స్ కాలీఫ్లవర్‌ను ఫ్రై చేస్తే, సాంబార్‌తో పాటు తినడం చాలా అద్భుతంగా ఉంటుంది. మరియు ఈ రెండు కూరగాయలు శరీరానికి ఆరోగ్యకరమైనవి కాబట్టి, వాటిని తరచుగా మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

చెట్టినాడ్ బీన్స్ కాలీఫ్లవర్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? చెట్టినాడ్ బీన్స్ కాలీఫ్లవర్ ఫ్రై రెసిపీ తయారీకి ఏమేం కావాలి, ఎలా తయారుచేయాలో రెసిపీ క్రింద ఉంది. దయచేసి దీన్ని చదివి, రుచి ఎలా ఉందో దాని గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

Chettinad Beans & Cauliflower Fry Recipe In Telugu

కావల్సినవి:

* కాలీఫ్లవర్ - 1

* గ్రీన్ బీన్స్ - 200 గ్రా (సన్నగ తరిగిన)

* ఆవాలు - 1 టేబుల్ స్పూన్

*పప్పు దినుసులు - 1 టేబుల్ స్పూన్

* కరివేపాకు - కొద్దిగా

* మిరప పొడి - 1 టేబుల్ స్పూన్

* పసుపు పొడి - 1/2 టేబుల్ స్పూన్

* ఉప్పు - రుచికి

* మంచి నూనె - 1 టేబుల్ స్పూన్

రెసిపీ తయారుచేయు విధానం:

* మొదట మీరు కూరగాయలను సరైన పరిమాణంలో కత్తిరించాలి. తర్వాత వాటి ఉప్పు నీటిలో వేసి కడిగి, తీసి పక్కన పెట్టుకోాలి

* తరువాత కాలీఫ్లవర్ మరియు బీన్స్ రెండింటినీ వేడినీటిలో వేసి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించి, ఆపై నీటిని వంపేయాలి.

* తరువాత స్టౌ మీద పాన్ పెట్టి వేయించడానికి నూనె వేసి, అందులో నూనె పోసి వేడిగా ఉన్నప్పుడు ఆవాలు, పప్పు దినుసులు జోడించండి.

* తరువాత, కరివేపాకు, కారం పొడి, పసుపు పొడి మరియు ఉడికించిన కూరగాయలు వేసి ఉప్పుతో చల్లి బాగా వేయించాలి.

* కూరగాయలను మసాలా దినుసులతో కలిపి 2 నిమిషాలు బాగా కలపాలి, అంతే రుచికరమైన చెట్టినాడ్ కాలీఫ్లవర్ బీన్స్ ఫ్రై సిద్ధంగా ఉంది.

Image Courtesy: archanaskitchen

English summary

Chettinad Beans & Cauliflower Fry Recipe In Telugu

Here is the recipe of Chettinad Beans & Cauliflower Fry Recipe In Telugu
Desktop Bottom Promotion