For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిల్డ్ సమ్మర్ ఫ్రూట్ సలాడ్ : హెల్తీ బ్రేక్ ఫాస్ట్

|

వేసవిలో చాలా వరకు అన్ని రకాల పండ్లు దొరుకుతాయి. ముఖ్యంగా శరీరాన్ని కూల్ గా ఉంచే పండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఉదా: పచ్చకాయ, దోసకాయ, కీరకాయ వంటవి శరీరానికి తగినంత చల్లదాన్ని అంధిస్తాయి. వేసవిలో అధిక వేడి, ఎండల వల్ల మన శరీరంను కాపాడుకోవడానికి ఇటువంటి పండ్లను తప్పని సరిగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అప్పుడే సన్ టాన్, వడదెబ్బ నుండా మన శరీరాన్ని చర్మాన్ని రక్షించుకోగలుగుతాము.

ఈ సమ్మర్ ఫ్రూట్స్ శరీరానికి, చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను అంధివ్వడం మాత్రమే కాదు, ఇవి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే రోజంతటికీ కావల్సిన ఎనర్జీని అందిస్తాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ పండ్లలోని నేచురల్ షుగర్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వేసవి సీజన్ లో అన్ని నెలల్లో ఈ హెల్తీ ఫ్రూట్స్ తో సలాడ్స్ తయారుచేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. మరి హెల్తీ న్యూట్రీయంట్స్ సలాడ్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం..

Chilled Summer Fruit Salad For Breakfast

కావల్సిన పదార్థాలు:

పుచ్చకాయ: 1
దోసకాయ: 1/2
మామిడిపండ్లు: 2
బొప్పాయి: 1/2
అరటి పండ్లు: 2
బ్లాక్ సాల్ట్: రుచికి సరిపడా
షుగర్ 1tsp

తయారుచేయు విధానం:

1. ముందుగా పుచ్చకాయను మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పంచదార వేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఈ పుచ్చకాయను రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టాలి.
3. అలాగే బొప్పాయకాను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. అలాగే మస్క్ మెలోన్(దోసకాయను)కూడా కట్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా రిఫ్రిజరేటర్ లో పెట్టుకోవాలి. వాటిని ఓపెన్ గా పెట్టకూడదు. అలా పెడితే, రుచి, పోషకాలు కోల్పియి, డ్రైగా ఉంటాయి.
4. అలాగే మామిడిపండ్లను కూడా చేత్తో సాఫ్ట్ గా తీసుకోవాలి. మూత ఉన్న ఒక బాటిల్ లేదా బాక్స్ లో వేసి వీటిని కూడా ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.
5. తర్వాత వాటర్ మెలో తీసుకొని అందులోనే గింజలను సాధ్యమైతే తొలగించి ఒక పెద్ద బౌల్లో వేయాలి.
6. వీటితో పాటు, దోసకాయ, బొప్పాయ కాయ ముక్కలు, అలాగే అరటి పండ్ల ముక్కలు కూడా వేయాలి.
7. వీటితో పాటు లిచి పండ్లను కూడా సర్ధాలి. ఈ కట్ చేసి పండ్ల ముక్కలమీద అన్నింటి మీద పడేలా మామిడికాయ గుజ్జును కూడా వేయాలి.
8. చివరగా కొద్దిగా బ్లాక్ సాల్ట్ బేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. అంతే సమ్మర్ చిల్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ.

English summary

Chilled Summer Fruit Salad For Breakfast


 Summer is the time to enjoy frozen desserts and lots of cooling fruits. There are some special fruits for summer and these have a cooling effect on the body. If you want to keep heat strokes at bay, try having a summer fruit salad as your morning meal. The summer fruit salad recipe has to be refrigerated overnight so that it can be had chilled in the morning.
Story first published: Thursday, April 24, 2014, 10:29 [IST]
Desktop Bottom Promotion