For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చోలే పొటాటో విత్ పూరి

|
Chole Potato With Puri
కావలసిన పదార్ధాలు:
మైదా పిండి: 2cup
బొంబాయిరవ్వ: 1tbsp
పెరుగు: 2tbsp
బేకింగ్ పౌడర్: 1tsp
పంచదార: 1/2tsp
ఉప్పు: కొద్దిగా
నూనె: సరిపడా

తయారు చేయు విధానం:
1 . మైదాపిండి, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి. పిండిలో అన్నీ కలిపి చపాతీ పిండిలా సాఫ్ట్ గా ముద్ద చేసుకుని ఒక అరగంటపాటు నాననివ్వాలి.
2. తర్వాత ఒకసారి బాగా మర్దించి చిన్న చిన్న ఉండలు చేసి పూరీలు వత్తుకోవాలి. కాగిన నూనెలో దోరగా వేయించి చోలేకూరతో వడ్డించాలి.

చోలే ఆలూ మసాలా:
చోలే: 2cups
ఆలూ: 2
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4-6
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: ఒక కట్ట
టమాటాలు:2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
చోలేమసాలా పొడి: 1tsp
నూనె: సరిపడా
ఉప్పు ,కారం,పసుపు: తగినంత
లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానిఆకు, జీలకర్ర: కొద్దిగా

తయారు చేయు పధ్ధతి:
1. ముందుగా శనగలను నానబెట్టుకోవాలి.
2. తర్వాత నూనె వేడిచేసి నాలుగు లవంగాలు,చిన్న దాల్చినచెక్క, రెండు యాలకులు, బిర్యానీ ఆకు వేయాలి.
3. సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి,కరివేపాకు వేసి దోరగా వేయించాలి. అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత టమాటాముక్కలు వేయాలి.
4. ఇప్పుడు పసుపు,కారం వేసి ఆలూ ముక్కలు , నానబెట్టుకొన్న శెనగలు కూడా వేసి కలపాలి. తగినంత ఉప్పు వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలి.
స్టీం పోయాక చోలేమసాలా పొడి,కొత్తిమీర వేసి కొంచెం చిక్కబడ్డాక స్టౌ ఆఫ్ చెయ్యాలి.ఆలూ వెయ్యడం వలన గ్రేవీ బాగా వస్తుంది.

English summary

Chole Potato With Puri | చోలే పొటాటో పూరి

Made of wheat dough, puri is the traditional fried Indian bread, served with a variety of side dishes, such as aloo subzi (potato curry), chole (chick pea curry) etc. Poori’s are wholesome whole wheat bread, that is an absolute favorite for both children and adults. In south india, its customary to serve poori (puri) with madras masala, which is a potato based side to go with them. However in North India, Poori's are served with chole or channa- a garbanzo bean side dish.
Story first published:Saturday, August 4, 2012, 10:07 [IST]
Desktop Bottom Promotion