For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుర్మా లడ్డు

|

Churma Laddu
కావలసిన పదార్ధాలు:

గోధుమ పిండి- 1/2 kg
చెక్కర పొడి- 400 grm
యాలకుల పొడి - 2 tbsp
జీడిపప్పు- 25 grm
నెయ్యి- 2 tbsp
ద్రాక్ష - 25 grm

తయారు చేయు విధానము:

1) గోధుమపిండిలో కొద్దిగా నెయ్యి కలిపి, తర్వాత కొద్దిగా నీళ్లు జల్లుతూ పిండిని పొడి పొడి గా కలియబెట్టాలి. ఈ పిండిని పది నిమిషాల పాటు తడి బట్టతో కప్పి వుంచండి.
2) తరువాత ఆ పిండిని గట్టిగా కలిపి పిడికిలికి సరిపడా పరిణామంలో చుట్టాలి. వీటిని బాణలిలో సన్నటి మంట మీద మరుగుతున్న నెయ్యిలో ఎర్రగా ఫ్రై చేసి తీసి చల్లారబెట్టి పొడిగా దంచి, జల్లెడ పట్టి పక్కన వుంచండి.
3) ఇప్పుడు ఇలా చేసిన గోధుమ చుర్మాలో చక్కెర పొడి,యాలకుల పొడి,జీడిపప్పు,కిస్ మిస్ లను కలిపి ,కొంచెం తడి చేతితో కావాల్సిన పరిణామంలో లడ్డూలు గా చుట్టి గట్టిపడ్డాక అథిదులకు వడ్డించండి.

Story first published:Monday, March 15, 2010, 16:08 [IST]
Desktop Bottom Promotion