For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మామిడి తురుము పచ్చడి

|

Crushed Mango Pachadi
మామిడి...వేసవి రెండింటిది విడదీయలేని అనుబంధం. అమోఘమైన రుచులతో వేడుక చేసే మామిడి పోషకాలకూ పెట్టింది పేరు. వ్యాధి నిరోధక శక్తిని అందించే ఎ, సి విటమిన్లతో పాటు బి కాంప్లెక్స్ విటమిన్లు సంవృద్దిగా లభిస్తాయి.

కావలసిన పదార్థాలు:
మామిడికాయ: 1 (చెక్కు తీసి తురమాలి)
వేయించిన ఆవాలు: 1tsp
మెంతులు: 1tsp
కారం: 3tsp
ఇంగువ: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: 1/4tsp
నూనె: 1cup

తయారు చేసే విధానం:
1. ముందుగా అవాలు, మెంతులు వేయించి పొడిచేసి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కారం, మెంతులు, ఆవాల పొడి వేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో ఇంకొంచెం నూనె వేసి మామిడి తురుము, పసుపు, ఉప్పు, వేసి మగ్గనివ్వాలి.
4. ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తరువాత దీనిలో పక్కకు తీసిపెట్టుకున్న కారం, మెంతి పొడి వేసిన నూనె వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

English summary

Crushed Mango Pachadi | మామిడి తురుము పచ్చడి


 Easy way to cook Mango Pachadi. The term pachadi refers to fresh pickles in Andhra. This must be one of the simplest dish. Green unripe mangoes are used. This recipe is one of those dishes that shouts out summer like no other dish!
Story first published:Thursday, May 17, 2012, 15:14 [IST]
Desktop Bottom Promotion