For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దహీ చెన్న కర్రీ : సైడ్ డిష్ రిసిపి

|

రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా. శెనగలతో తయారుచేసే సైడ్ డిష్ వంటలు నార్త్ స్టేట్స్ లో ఎక్కువ ప్రసిద్ది.

చెన్న లేదా శెనగలతో తయారుచేసే వంటలకు ఎక్కువగా మసాలాలను ఉపయోగిస్తారు. అయితే శెనగలతో తయారుచేసే వంటలు కొన్ని రెస్టారెంట్స్ లో గమనించినట్లైతే క్రీమీగా చిక్కగా నోరూరిస్తుంటాయి. అలా రెస్టారెంట్ ఫుడ్ మన ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఈ క్రింది విధంగా...

Dahi Chane Ki Sabzi: Side Dish Recipe

కావల్సిన పదార్థాలు:
చెన్న: 200grm(రాత్రంతా నీటిలో వేసి నానబెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2(నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2-3
అల్లం: కొద్దిగా
టమోటో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 5-6
చిక్కటి పెరుగు: 2tbsp
కారం: 1tsp
ధనియాలపొడి: 2tsp
పసుపు: 1tsp
గరం మసాల: 1tsp
చెన్న మసాల: 1tsp
దాల్చిన చెక్క: కొద్దిగా
లవంగాలు: 2
బిర్యానీ ఆకు: కొద్దిగా
ఉప్పు రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా నానబెట్టుకొన్న శెనగలలో నీరు వంపేసి కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు మరియు పసుపు కూడా వేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. అంతలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం మరియు వెల్లుల్లిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి . దీన్ని బౌల్లో వేసుకోవాలి.
3. అలాగే టమోటోను కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత డీప్ బాటన్ పాన్ ను స్టౌ మీద పెట్టి, అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, దాల్చిన చెక్క మరియు లవంగాలు వేసి ప్రై చేసుకోవాలి.
5. పోపు వేగిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చి పస్ట్ వేసి రెండు నిముషాలు మీడయం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. ఉల్లిపాయ ముక్కలు మొత్తబడిన తర్వాత, కొద్దిగా పసుపు, మరియు ఉప్పు వేసి మిక్స్ చేయాలి.
7. ఇప్పుడు అందులో టమోటో ముక్కలు వేసి మంట ఎక్కువగా పెట్టి ఒక నిముషం ఫ్రై చేసుకొని, తర్వాత అందులో చిక్కటి పెరుగును వేసి మిక్స్ చేయాలి.
8. మొత్తం మిశ్రమం కలియబెడుతూ, ఉడికించాలి. తర్వాత అందులో గరం మసాలా, చెన్నా మసాల, చెన్నా మసాలా, కారం మరియు ధనియాలపొడి వేసి మరో రెండు మూడు నిముషాలు ఉడికించుకోవాలి.
9. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మూత తీసి ఉడికించుకొన్న శెనగలను నీటితో సహా పోపులో పోసి, మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టి, చిక్క బడే వరకూ ఉడికించుకోవాలి.

English summary

Dahi Chane Ki Sabzi: Side Dish Recipe

Channa or chole, also known as chickpeas is one of the most popular side dishes in Indian cuisine. Chane ki sabzi can also be prepared with red grams and other lentils. However, the classic chole is the most commonly prepared side dish in the Northern states of India.
Story first published: Wednesday, April 29, 2015, 13:04 [IST]
Desktop Bottom Promotion