For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దహీ(పెరుగు) ఇడ్లీ -స్పెషల్ బ్రేక్ ఫాస్ట్

|

దహీ ఇడ్లీ లేదా పెరుగు ఇడ్లీ. ఒక పాపులర్ అయినటువంటి సౌత్ ఇండియన్ బేక్స్ ఫాస్ట్ రిసిపి. ఈ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ ను ప్రత్యేకమైన వస్తువులను తయారుచేస్తుంటారు . ఈ పదార్థాలన్నీ కూడా చర్మం సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతాయి. కొన్ని ప్రదేశాల్లో ఈ దహీ ఇడ్లీ అంత ఫేమస్ కాకపోవచ్చు. సాధారణ ఇడ్లీలు మాత్రంగానే తెలుసు. దహీ ఇడ్లీ ఒక అద్భుతమైన ట్రీట్ వంటిది .

బ్రేక్ ఫాస్ట్ కు ఈ స్పెషల్ పెరుగు ఇడ్లీలు తయారుచేయాలంటే, ఇది చాలా సులభం మార్గం. అన్ని మన వంట గదిలో ఉన్న వస్తువులతోనే అద్బుంతగా తయారుచేయవచ్చు. పెరుగు ఇండ్లీకి ముఖ్యంగా కావల్సింది చిక్కటి పెరుగు. దీన్ని బాగా చిలికించి, తర్వాత పోపుపెట్టి, ఇడ్లీలను డిప్ చేసి సర్వ్ చేస్తారు. టేస్ట్ అద్బుతంగా ఉదయం కడుపులో చల్లగా ఉంటుంది. మరి ఈ రుచికరమైన ఇడ్లీ ఎలా తయారుచేయాలో చూద్దాం..

Dahi Idli Recipe For Breakfast
ఇడ్లీలు - 20
పెరుగు - 5 కప్పులు
పాలు - 2 కప్
కొత్తిమీర - కొద్దిగా(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
క్యారెట్ - 1 (తురుము)
షుగర్ - 1tbsp
ఉప్పు - రుచికి సరిపడా
పొడి చేయడం కోసం
జీడిపప్పు: 500gms
కొబ్బరి - 3 టేబుల్ స్పూన్లు (తురుము)
పచ్చిమిరపకాయలు - 4 (మద్యకు కట్ చేసుకోవాలి)
పోపుకోసం
ఆవాలు: 1tsp
కరివేపాకు - 8
ఉద్దిపప్పు - 1 స్పూన్
ఎండు మిరపకాయలు - 5
ఇంగువ - ఒక చిటికెడు
నూనె - 2 tblsp
తయారుచేయు విధానం:

1. ముందుగా మన ట్రెడిషనల్ పద్దతిలో చిన్నచిన్న ఇడ్లీలను తయారుచేసుకోవాలి. ఇడ్లీలను తయారుచేసిన తర్వాత వాటిని, మీకు నచ్చిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పెరుగు మరియు పాలు వేసి ఎగ్ బీటర్ తో బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమానికి పంచదార మరియు ఉప్పు వేసి మిక్స్ చేయాలి .
3. ఇప్పుడు ఒక పాన్ లోనూనెవేసి వేడి చేసి వేడయ్యాక అందులో ఆవాలు, ఉద్దిపప్పు, రెడ్ చిల్లీ, మరియు కరివేపాకు వేయాలి. ఇవన్నీ రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా కలిపి పెట్టుకొన్న పెరుగు మిశ్రమం మరియు ఇంగువ వేసి మిక్స్ చేయాలి.
5. అలాగే జీడిపప్పు పొడి, పచ్చిమిర్చి, మరియు కొబ్బరి తురుము వేసి అన్నింటిని బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు ఈ పెరగు మిశ్రంలో ముందుగా తయారుచేసి పెట్టుకొన్న ఇడ్లీలను వేయాలి. వేసిన తర్వాత 15నిముషాలు నాననివ్వాలి .తర్వాత వీటిని మీ కుటుంబ సభ్యలకు సర్వ్ చేయాలి.
7. మీరు సర్వ్ చేసేటప్పుడు క్యారెట్ తురుము మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

English summary

Dahi Idli Recipe For Breakfast


 Dahi idli or curd idli is one of the most famous recipes in South India. The best part about this breakfast recipe is that it is made out of one of the most important ingredients which is good for your body and skin care, curd/yogurt.
Story first published: Thursday, November 14, 2013, 10:50 [IST]
Desktop Bottom Promotion