For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ పకోరా : టేస్టీ టీ టైమ్ స్నాక్

|

చాలా మంది క్రిస్పీ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. ఈవెనింగ్ అయ్యే సరికి ఒక కప్పు కాఫీతో పాటు, ఏదైనా వేడివేడి స్నాక్స్ తినాలని కోరుకుంటాం. అందులో క్రీస్పీగా ఉండేవి ఎక్కువగా ఇష్టపడుతారు. సాధారణంగా ఈవెనింగ్ స్నాక్స్ చాలా మంది ఇష్టపడుతారు. సాయంత్ర సమయాల్లో టీ, కాఫీలతో పాటు తీసుకొనే వేడి వేడి స్నాక్స్ లో పకోడ కూడా ఒకటి అందులో హెల్తీ పకోడా మిక్స్డ్ వెజిటేబుల్ పకోడా. పాలకు కూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యానికి ఉపయోగపడే న్యూట్రిషియన్స్ ను అందిస్తుంది. ఇది పిల్లలు పెద్దలు అమితంగా ఇష్టపడి తింటారు.

ఇది గ్రీన్ చట్నీ లేదా టమోటో కెచప్ తో చాలా గ్రేట్ స్నాక్. ఇది చాలా సింపుల్ మరియు ఈజీ పాలక్ పకోడా. చాలా తక్కువ సమయంలో దీన్ని తయారుచేయవచ్చు. ఈ సింపుల్ స్నాక్ రిసిపిని శెనగపిండితో తయారుచేస్తారు. ఇందులోతాజా కూరగాయలతో తయారుచేస్తారు. అంతే కాదు, రుచికూడా అద్భుతంగా ఉంటుంది. ఈ స్నాక్ ను గ్రీన్ చట్నీ లేదా టమోటో కెచప్ తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Delectable Vegetable Pakora Recipe

కావల్సిన పదార్థాలు:
సోంపు: 1 tsp
ధనియాలు: (సోంపు మరియు వాము రెండు కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలి)
వాము : 1 tsp
శనగ పిండి : 1cup
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : 2tbsp
మెంతి ఆకులు : 2tbps
క్యారెట్ : 2 tbsp
క్యాప్సికమ్ : 1tsp
పొటాటో : 2 tbsp
పచ్చిమిర్చి : 1 tsp
ఆకుకూర: 1tbsp
చిన్న ఉల్లిపాయలు: 1 tbsp
ఉల్లిపాయ : 1 tbsp
పనీర్ : 1tbsp
కొత్తిమిర : కొద్దిగా
కారం : 1tsp
నీరు: పిండికలుపుకోవడానికి సరిపడా

తయారుచేయువిధానం:
1. తయారుచేయడానికి సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి, బాగా మిక్స్ చేసి 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి.
3. పాన్ లో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి వేడయ్యాక కలుపుకొన్న పిండి మిశ్రమాన్ని కొద్దిగా కొద్దిగా తీసుకొని కాగే నూనెలో పకోడాల్లా వేయాలి.
4. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. మద్యమద్యలో ఫ్రైయింగ్ స్పూన్ తో అటు ఇటు తిప్పడం వల్ల చాలా తర్వాత అన్ని వైపులా సమయంగా ఫ్రై అవుతాయి. అంతే వేడి వేడి టేస్టీ వెజిటేబుల్ పకోడా రెడీ. ఈవెనింగ్ టీ టైమ్ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది.

English summary

Delectable Vegetable Pakora Recipe

Vegetable pakora.... does the name itself cause you to salivate? This evening snack recipe is one of the best you can have with that cup of hot chai. Many Indians love to have a fried snack along with tea or coffee.
Story first published: Thursday, February 26, 2015, 17:10 [IST]
Desktop Bottom Promotion