For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అటుకులు, నెయ్యితో తో అద్భుతమైన పొంగల్ రిసిపి..!

By Lekhaka
|

ఈ పేరు వింటేనే పొంగల్ లేదా సంక్రాంతి సమయంలో దక్షిణ భారతంలో వండుకునే వంటకం అని తెలిసిపోతోంది కదా.దీనిని మీరు పొద్దున్నే అల్పాహారంగా లేదా లంచ్లోనూ తీసుకోవచ్చు.

అతి కొద్ది వస్తువులతో 20 నిమిషాల్లో తయారయ్యే పదార్ధం ఇది.అందువల్ల ఉదయం అల్పాహారం ఏమి చెయ్యాలి అని ఆలోచించే తీరిక లేనప్పుడు దీనిని తయారు చేసుకోవచ్చు.

పొంగల్ని సాంబారు లేదా చట్నీతో వడ్డించవచ్చు.కానీ ఈ వంటకం తయారీలో వాడే నీళ్ళ కొలత విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి సుమా. ఇది మరీ నీళ్ళగా లేదా మరీ ముద్దగా అవ్వకూడదు.అసలు దీని తయారీకి ఏమి కావలో తయారీ విధానమెలాగో చూద్దామా.

pongal recipe

సామాన్లు సమకూర్చుకోవడానికి-10 నిమిషాలు

వండటానికి-15/20 నిమిషాలు

కావాల్సిన పదార్ధాలు:

1.అటుకులు -ఒక కప్పు

2.పెసర పప్పు-పావు కప్పు

3.న్నీళ్ళు-4 కప్పులు

4.పసుపు-చిటికెడు

5.అల్లం-సన్నగా తరిగినది ఒక తేబుల్ స్పూను

6.జీడి పప్పులు-8

7.నల్ల మిరియాలు-ఒక తేబుల్ స్పూను

8.ఉప్పు-రుచికి తగినంత

9.పచ్చి మిర్చి-2

పోపు కోసం:

1.నూనె-2 టేబుల్ స్పూన్లు

2.కరివేపాకు-ఒక చిన్న కట్ట

3.నెయ్యి-2 టేబుల్ స్పూన్లు

4.జీలకర్ర-2 టీ స్పూన్లు

5.ఇంగువ-చిటికెడు

తయారీ విధానం:

1. ఒక మూకుడూ తీసుకుని నూనె వెయ్యకుండా వేడీ చేసి పెసరపప్పు దోరగా కమ్మటి సువాసన వచ్చేవరకూ వేయించాలి.

2.దీనిలో కొంచం పసుపు,నీళ్ళు పోసి పప్పుని మెత్తగా ఉడకనివ్వాలి. పప్పు ఉడికాకా బయటకి తీసి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి.

3.అటుకులని బాగా కడిగి,ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి.ఇంతలో జీలకర్ర,మిరియాలని బరకగా దంచుకోవాలి.

4.ఒక మూకుడు తీసుకుని వేడయ్యాకా దానిలో నూనె, నెయ్యి వెయ్యాలి.దీనిలో అల్లం,కరివేపాకు,పచ్చి మిర్చివేసి బాగా వేయించాలి.

5.దీనిలో మిరియాలు,జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడనివ్వాలి.

6.దీనికి మెత్తగా మెదిపిన పప్పు కలిపి ఉప్పు చేర్చాలి.అన్ని దినుసులూ కలిసేలా బాగా కలపాలి.

7.జీలకర్ర తదితర సుగంధ ద్రవ్యాలతో కలిసి పప్పు ఉడికాకా అటుకులు వేసి బాగా ఉడకనివ్వాలి.ఇప్పుడు అన్ని పదార్ధాలు బాగా కలుస్తాయి.

8.ఒక చిన్న మూకుడు తీసుకుని దానిలో నెయ్యి వేసి వేడీ చేసి కరివేపాకు,ఇంగువ, జీడిపప్పు వేసి ఈ పోపుని ఉడికిన బియ్యం,పప్పు మిశ్రమం మీద చేస్రిస్తే రుచికరమైన పొంగల్ రెడీ.

ఈ అవల్ పొంగల్ చాలా రుచికరంగా ఉంటుంది.దీనిని మీరు ఉదయం అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు.మరింక ఆలశ్యమెందుకు, ఈ పొంగల్ లేదా సంక్రాంతి రోజున ఇది ప్రయత్నించి మీ అభిప్రాయాలని మాకు తెలియచేయండి

English summary

Delicious Aval And Ghee Pongal Recipe

Though the name states that this is a special dish to be prepared on Pongal/Sankranti in South India, you can prepare it any day for breakfast, or lunch, and enjoy it to your heart's content at home.
Desktop Bottom Promotion