For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన పనసగింజల రసం రిసిపి

By Super Admin
|

పండ్లలో జాక్ ఫ్రూట్ (పనసకాయ) అత్యంత రుచికరమైనది! ఈ జ్యూసీ ఫ్రూట్ కొద్దిగా కూడా వదలకుండా మొత్తం తినేస్తుంటారు .! అద్భుతమైన టేస్ట్, స్వీట్ టేస్ట్ ఉండే ఈ పనసకాయ సీజనల్ ఫ్రూట్ వేసవిలో ప్రారంభమై జూలైవరకూ ఈ పండ్లు మనల్ని ఊరిస్తుంటాయి .

పనసకాయలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి . ఒక్క ఫ్రూట్ లోనే కాదు, పనసతొనలలోపల ఉండే గింజల్లో కూడా అనేక ప్రయోజనాలున్నాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్, మినిరల్స్, మరియు ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఈ పనసతొనలను, విత్తనాలను వివిధ రకాలుగా ఉపయోగించుకుని తింటుంటారు. వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. తేనెలో డిప్ చేసి తింటే మరింత అద్భుతమైన టేస్ట్ కలిగి ఉంటుంది. వీటితో పాయసం, కర్రీ మరియు ఇతర యమ్మీ డిషెస్ ను మరెన్నో తయారుచేస్తుంటారు.

మరో విషయం మర్చిపోకండి. జాక్ ఫ్రూట్ తిన్నప్పుడు విత్తనాలను పడేయుండా వాటిని కడిగి, ఎండలో ఒక రోజు ఎండ బెట్టి వంటల్లో ఉపయోగించుకోవచ్చు .రుచికి కూడా అద్భుతంగా ఉంటుంది . పనసకాయతో వివిధ రకాల వంటలను వండుతారు . అలాగే విత్తనాలను కూడా వివిధ వంటల్లో జోడించుకోవచ్చు . పనస గింజలతో తయారుచేసే రసం రిసిపి చాలా డిఫరెంట్ టేస్గ్ కలిగి ఉంటుంది. . రసం తయారుచేయడానికి ఒక రోజు ముందు గింజలను పూర్తిగా ఎండలో ఎండ బెట్టి తర్వాత తయారుచేసుకోవాలి.

Delicious Jackfruit Rasam Recipe

కావల్సినవి:

పనగింజలు - 10 to 15

కొబ్బరి తురుము - 1 cup

జీలకర్ర - 1/2 cup

ఎండుమిర్చి - 4 to 5

ధనియాలు - 1/2 teaspoon

చింతపండు- Size of a lemon

బెల్లం- 1 teaspoon

పసుపు - 1/2 teaspoon

ఆవాలు - 1/2 teaspoon

ఉల్లిపాయలు - 1 Cup

టమోటోలు - 1 Cup

కొత్తిమీర - 1/2 cup

ఉపు: రుచికి సరిపడా

నూనె సరిపడా

తయారుచేయు విధానం:

1. పనసగింజలను ఎండలో ఎండబెట్టాలి. (ఇలా చేయడం వల్ల పైపొట్టును సులభంగా తొలగించవచ్చు)

2. తర్వాత పససగింజలను రఫ్ గా పొడి చేసుకోవాలి.

3. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందలో డ్రై అయిన జాక్ ఫ్రూట్ పొడి వేసి సరిపడా నీళ్ళు పోయాలి.

4. తర్వాత మూత పెట్టి, నాలుగైదు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల పనసగింజలు మెత్తగా అవుతాయి.

5. ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత, స్టౌ ఆప్ చేసి చల్లారనివ్వాలి. పనసగింజలు చాలా మెత్తగా ఉడికుండాలి. మెత్తగా ఉడికినట్లైతే వీటిని పక్కన పెట్టుకోవాలి

6. ఇప్పుడు పాన్ తీసుకుని స్టౌ మీద పెట్టి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ధనియాలు మరియు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.

7. లైట్ గా వేగించుకున్న వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోవేసి, వీటితోపాటు చింత పండు, బెల్లం మరియు కొబ్బరి తురుము వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.

8. అలాగే ఈ మసాలా పేస్ట్ తో పాటు 5 జాక్ ఫ్రూట్(ఉడికించిన పనగింజలను)కూడా వేసి, అవసరమైతే నీరు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

9. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని అందులో నూనె వేసి వేగిన తర్వాత ఆవాలు, ఉల్లిపాయలు మరియు టమోటోలు కూడా వేసి వేగించుకోవాలి.

10. తర్వాత వేగుతున్న మిశ్రమంలో గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి వేగించుకోవాలి . తర్వాత సరిపడా నీళ్ళు, మొత్తం మిశ్రమం కలగలిపి, అందులోనే కొత్తిమీర తరుగు గార్నిషింగ్ గా వేసి 5-10నిముషాలు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి, స్పైసీ జాక్ ఫ్రూట్ రసం రెడీ. ఈ రసంతో పాటు కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే అద్భుతమైన రుచి ఉంటుంది. ఈ డిఫరెంట్ రసం రిసిపిని మీరు ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి.

English summary

Delicious Jackfruit Rasam Recipe

Jackfruit is the most delicious fruit that you have to try! This juicy fruit never allows us stop with just one bite! Since it is a seasonal fruit, it is available during the summer season until the month of July in some parts of India.
Story first published:Tuesday, July 26, 2016, 17:25 [IST]
Desktop Bottom Promotion