For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన తేరి రిసిపి: ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్

|

ఉత్తర్ ప్రదేశ్ లో నార్మల్ గా చేసుకొనే ఒక వెరైటీ వంటను మనం ఇక్కడ కాస్త స్పెషల్ గా తయారుచేసుకోవచ్చు. పూర్వకాలంలో వంటలు కుండల్లో , పొయ్యి మీ వండేవారు. అందుకే ఆ వంటలు అంతరుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండేవి. అదే వంటల సాంప్రదాయంను ఉత్తర్ ప్రదేశ్ లో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కుండలో సువాసనభరిమతైన మసాలాలు మరియు వెజిటేబుల్స్ జోడించి తయారుచేసి ఈ వంటకు చాలా ప్రత్యేకత ఉంది.

READ MORE: ముల్లంగి సాంబార్ రిసిపి: సౌత్ ఇండియన్ స్పెషల్

కుండలో చేసి ఈ రైస్ రిసిపిని మద్యహ్నాన భోజనం, లేదా రాత్రి డిన్నర్ కు తీసుకోవచ్చు. ఈ రైస్ రిసిపికి వేరే ఏ ఇతర కర్రీలు అవసరం ఉండదు. సాధా పెరుగు ఒక్కటి చాలు. ఈ మసాలాను వివిధ రకాల వెజిటేబుల్స్ తో ఉడికించడం వల్ల ఆరోగ్యానికి పూర్తి పోషకాలను అందిచ్చవచ్చు. మరి ఈ స్పెషల్ రైస్ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం....

Delicious Tehri Recipe: Uttar Pradesh Special: Telugu Vantalu

కావల్సిన పదార్థాలు:
వైట్ రైస్ - 2 cups
కాలీఫ్లవర్ - 100 gms
ఉల్లిపాయలు - 2
బంగాళదుంపలు - 3
పచ్చిబఠానీలు - ½ cup
పచ్చిమిర్చి - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 tsp
నూనె- 3 tsp
నెయ్యి - 2 tsp
బిర్యానీ ఆకు - 2
దాల్చినచెక్క - 2 stick
యాలకలు - 2 pods
లవంగాలు- 4
పసుపు - ½ tsp
కారం - ½ tsp
ధనియాలపొడి-1tsp
గరం మసాలా - 1/4 tsp
ఉప్పు: రుచికి సరిపడా

READ MORE: హెర్బ్ ఫ్రైడ్ రైస్ రిసిపి -బెటర్ హెల్త్

తయారుచేయు విధానం:
1. మొదటగా బియ్యంను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాట్/తేరి(కుండలో) నూనె వేసి, వేడి అయిన తర్వాత అందులో మసాలాలు, యాలకలు, బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఆరోమా వాసన వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి
4. ఇప్పుడు అందులో మిర్చి,పసుపు, మరియు ధనియాలపొడి వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులో పచ్చిబఠానీలు, ఉప్పు, వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి
6. తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న బియ్యంను కూడా వేసి, నిధానంగా మిక్స్ చేయాలి. దీన్ని 10నిముషాలు ఉడికించుకోవాలి.
8. పది నిముషాల తర్వాత బియ్యం పూర్తిగా ఉడుకుతున్న సమయంలో మంటను పూర్తిగా తగ్గించి రెండు మూడు నిముషాలు సిమ్ లో పెట్టుకోవాలి. అంతే రుచికరమైన తేరి రిసిపి రెడీ...

English summary

Delicious Tehri Recipe: Uttar Pradesh Special: Telugu Vantalu

Delicious Tehri Recipe: Uttar Pradesh Special: Telugu Vantaluk, Today, we are here to share pot rice meal for afternoon meal which was originated in Uttar Pradesh, India. This tehri meal is wholesome on its own with flavoured and spicy vegetables mixed along with aromatic rice cooked together.
Story first published: Tuesday, July 14, 2015, 17:32 [IST]
Desktop Bottom Promotion