For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేరుశెనగపప్పు మునక్కాడ శాంబార్

|

Drumstick and Groundnuts Sambar
కావలసిన పదార్థాలు:
వేరుశెనగ పప్పు: 1cup
మునక్కాడలు: 1cup
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ధనియాలు: 1tsp
చింతపండు గుజ్జు: 1/2 cup
పచ్చిమిర్చి: 4
టొమోటోలు: 2
ఉల్లిపాయలు: 2
వెల్లుల్లి రెబ్బలు: 8
ఎండుమిర్చి: 4
కరివేపాకు, కొత్తిమీర: తగినంత
ఉప్పు: రుచి తగినంత
నూనె: కావలసినంత

తయారీ విధానం:
1. ముందుగా వేరుశెనగ పప్పును వేయించి, చల్లారిన తరువాత పొట్టు తీయాలి.
2. తర్వాత వేరుశెనగపలుకులకు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలను చేర్చి ముద్దలా చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మనక్కాడలు, టొమోటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలను విడిగా ఒక పాత్రలో తీసుకుని తగినంత ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి ఉడికించాలి.
4. తరువాత చింతపండు గుజ్జు చేర్చి, ముందే సిద్ధం చేసి పెట్టుకున్న వేరుశెనగ మిశ్రమాన్ని కూడా కలిపి సన్నటి మంటపై ఉడికించాలి.
5. ఇప్పుడు ఒక బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు చేసి ఉడుకుతున్న సాంబారులో కలపాలి. దించేముందు కరివేపాకు రెబ్బలు, కొత్తిమీరతో అలంకరిస్తే వేడి వేడి వేరుశెనగ సాంబారు రెడీ.

Story first published:Friday, April 23, 2010, 13:07 [IST]
Desktop Bottom Promotion