For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై చెనా మసాల రిసిపి

|

చిక్ పీస్ లేదా చెనా (శెనగలు)లను మన ఇండియన్ కుషన్స్ లో విరివిగా ఉపయోగిస్తుంటారు . వీటిని ఉడికించి ఉప్పు, మిరియాలపొడి చల్లుకొని స్నాక్ గా తీసుకుంటుంటారు. చాట్ చన్నా లేదా సింపుల్ గా తయారుచేసే చనా మసాలా వేటికవి రుచికరంగా ఉంటాయి. నార్త్ స్టేట్స్ లో చెన్నా బతురా ఒక రుచికరమైన స్ట్రీట్ ఫుడ్. శెనగలు రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా..

ఇది లెగ్యుమ్ ఫ్యామిలీకి చెదినవి కాబట్టి ఎక్కువ పోషకాలు, న్యూట్రీషియన్స్ క్యాల్షియం, ఐరన్, డైటరీ ఫైబర్, పొటాషియం, సోడియం, జింక్ వంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఎంతైన అవసరం . చెనా మసాలా గ్రేవీ మనం తరచూ చేస్తుంటాం. మరి డ్రైడ్ చెనా మసాలాను ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది స్పైసీగా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్ గా దీన్ని సర్వ్ చేయవచ్చు. ఈ వంట చాలా సింపుల్.

Dry Chana Masala Recipe

కావల్సిన పదార్థాలు:

చనా(శెనగలు): 2cups (రాత్రంతా నానబెట్టాలి)
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగాలి)
టమోటో: 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి :3-4 (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం: 1 అంగుళం (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లిరెబ్బలు: 7-8(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 2tsp
ధనియాల పొడి ½ tsp
గరం మసాలా: 1tsp
చనా మసాలా: 1tsp
అల్లం పేస్ట్: 1tsp
జీలకర్ర: 1tsp
బే ఆకు 1
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకొన్న శెనగలను శుభ్రంగా కడిగి ప్రెజర్ కుక్కర్ లో వేసి 4, 5 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి పెట్టుకోవాలి.
2. అంతలోపు, ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, వేడిచేసి అందులో బిర్యానీ ఆకు మరియు జీలకర్ర వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి ఎక్కువ మంట మీద 5నిముషాలు వేగించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
4., తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమోటో, ఉప్పు మరియు పసుపు, వేసి బాగా మిక్స్ చేస్తూ 3 నిముషాలు వేగించుకోవాలి.
5. తర్వాత కారం, గరం మసాలా, జీలకర్ర, చెన్నా మసాలా, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
6. అన్నీ వేగిన తర్వాత అందులో ఉడికించుకొన్న చెన్నా మరియు కొద్దిగా నీళ్ళు పోసి, మొత్తం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్క బడే వరకూ , నీరు మొత్తం ఇమిరిపోయే వరకూ ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే డ్రై చెనా మసాలా రెడీ. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి గా సర్వ్ చేయాలి. పరోటో రైస్ లేదా రోటీలకు మంచి కాంబినేషన్ ఫుడ్ ఇది.

English summary

Dry Chana Masala Recipe


 Chickpeas or chana is widely used in Indian cuisine. We boil it to have as a snack. Serve chaat with chana or simply make chana masala. Chana bhatura is a staple street food in the northern states of India. Chickpeas is not just tasty, but healthy too.
Story first published: Friday, May 23, 2014, 11:54 [IST]
Desktop Bottom Promotion