For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌత్ ఇండియన్ రిసిపి: గుడ్డు మునక్కాడ ఫ్రై

|

Image curtasy: youtube.com

వంటలకు ఘుమఘమలను అందించి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాటిలో చెప్పుకోతగ్గది మునగ, మునగకాడల్ని చారు, సాంబారు, కూర, పచ్చడి సూప్ వంటివెన్నో రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు.

ఈ మునగకాడకు మరో హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్ జోడించి ఫ్రై చేస్తే మరి డబుల్ గా పోషకాలు శరీరానికి అందుతాయి. మునగకాడ, గుడ్డు ఫ్రై అద్భుతమైన రుచి, ఆరోగ్యం. ఈ రెండింటి కాంబినేషన్ లో తయారుచేసే వంటి రైస్ లోకి అంద్బుతంగా ఉంటుంది. ఈ వంటను ముఖ్యంగా సౌంత్ ఇండియాలో ఎక్కువగా తయారుచేసుకుంటారు. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం....

egg drumstick fry preparation

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4
మునగకాడలు: 1 or 2(కావల్సిన సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 6
టమోటో: 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
కారం: 1tsp
కొత్తిమీర: కొద్దిగా
కరివేపాకు: 2రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : తగినంత

Read More: గుడ్డు తినండి గుడ్ గా ఉండండి
తయారుచేయువిధానం
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఉల్లిపాయ, టమోటో ముక్కలు వేసి 5 నిముషాలు సన్నని మంట మీద వేగించుకోవాలి.
2. ఉల్లి, టమోటో మెత్తగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు మరియు కారం వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. ఫ్రై అయిన తర్వాత పాన్ లో నూనె విడిగా ఏర్పడే సమయంలో అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి, మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకోవాలి.
4. అందులోనే మునగకాడల ముక్కలు వేసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.

READ MORE: మునగకాయ మహిమకు మునక్కాయే సాటి...!
5. రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రేవి చిక్కబడి, మునగకాడలు మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న గుడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా గుడ్లు రోస్ట్ అయిన తర్వాత వాటిని డ్రమ్ స్ట్రిక్ ఫ్రైలో వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి . అంతే డ్రమ్ స్టిక్ మరియు ఎగ్ ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంకు చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Egg Recipes : South Indian Recipe: Egg Drumstick Fry

Egg Recipes : South Indian Recipe: Egg Drumstick Fry, This is a simple, yet nutritious dish made with drumstick and eggs, both food have amazing health benefits.This cooking method (stir fry) will not reduce it's nutritional value.
Story first published: Monday, October 19, 2015, 12:53 [IST]
Desktop Bottom Promotion