For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దహీ పూరి: యమ్మీ ఈవెనింగ్ స్నాక్ రిసిపి

|

ఈవెనింగ్ స్నాక్ రిసిపలలో వివిధరకాలున్నాయి. అలాంటి వాటిలో దహీపూరీ, ఈవెనింగ్ ఛాట్ రిసిపిలు, ఈవెనింగ్ స్నాక్స్ .

దహీ పూరీ అమేజింగ్ టేస్ట్ ఉన్న స్నాక్ రిసిపి. దహీపూరి ఛాట్ రిసిపిని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇది టేస్ట్ బడ్స్ ను నోరించేలా చేస్తుంది. కలర్ ఫుల్ గా ఉండే ఈ స్నాక్ రిసిపి నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ రిసిపి

అంతే కాదు, సౌత్ ఇండియన్స్ కూడా ఇది ఒక హాట్ ఫేవరెట్ స్నాక్ డిష్. దహీ పూరి చాట్ డిష్ , ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే . ఇందులో జోడించే పెరుగు, లైట్ మసాలాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది రోడ్ సైడ్ స్నాక్ రిపియైనా, మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు ముఖ్యంగా రోజంతా అలసిపోయినప్పుడు వెంటనే రిలాక్స్ పొందాలంటే చల్లగా ఉండే దహీ పూరిని తయారుచేసి తినడమే ఆలస్యం. ఇది మీ ఇంటిల్లి పాదికి నచ్చుతుంది కాబట్టి , వీకెండ్ హాలిడేస్ లో కూడా బెస్ట్ స్నాక్ గా తయారుచేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Evening Snack Recipe: Dahi Puri

కావల్సిన పదార్థాలు:
పూరిలు: 10
పెరుగు - 1cup
సేవ్(సన్నని మిక్షర్) - 1cup
ఉడికించిన బంగాళ దుంపలు - 1cup
ఉడికించిన బఠానీలు - 1cup
మింట్ పచ్చడి - 1tbsp
కొత్తిమీర పచ్చడి - 1tbsp
మసాలా చాట్ - 1 tsp
కారం - 1/4 tsp
తరిగిన కొత్తిమీర - 1/2 tsp
ఉప్పు - రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను ఉడికించి, తొక్క తీసి పెద్ద గిన్నెలో వేసి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు అందులో ఛాట్ మసాలా, చిల్లీపౌడర్ మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
3. తర్వాత రెడిమేడ్ పూరీలను ఒక ప్లేట్ లోకి తీసుకొని మద్యలో ఒకసైడ్ మాత్రమే రంద్రం పెట్టుకోవాలి . ఆ పూరిల్లో బంగాళదుంప మిశ్రమాన్ని ఫిల్ చేయాలి.
4. తర్వాత వాటి మీద పెరుగు ఒకటి లేదా రెండు చెంచాలతో ఫిల్ చేయాలి .
5. అలాగే పెరుగు మీద మీకు నచ్చే రుచిని బట్టి కొత్తిమీర లేదా పుదీనా చట్నీని కూడా వేయాలి .
6. చివరగా సేవ్ మరియు కొత్తిమీర తరుగు చిలకరించాలి .
7. అంతే యమ్మీ డెలిషియస్ దహీ పూరి రెడీ. దీన్ని తయారచేసిన వెంటనే అందిస్తే కమ్మని రుచిని కలిగి క్రిస్పీగా ఉంటుంది.

English summary

Evening Snack Recipe: Dahi Puri /snack recipe/telugu vantalu

snack, dahi puri recipe, chaat recipe for evening, recipes for evening, evening snacks. When you see your husband come home tired after a hectic day, you definitely would want to cook him something that he relishes. So, here we are sharing the recipe of dahi puri, an awesome yummy evening chaat, that can please his taste buds for sure.
Story first published:Thursday, November 26, 2015, 16:07 [IST]
Desktop Bottom Promotion