For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్సోటిక్ గ్రీన్ మ్యాంగో రైస్ పులావ్ రిసిపి

|

వేసవి సీజన్ లో పచ్చిమామిడి విరివిగా దొరుకుతుంది. పచ్చిమామిడికాయతో ఊరగాయలు, సలాడ్స్, కర్రీస్ మరియు పులావ్ ను తయారుచేస్తారు . అంతే కాదు పచ్చిమామిడికాయతో వెరైటీగా పులావ్ రిసిపిని కూడా తయారుచేసుకోవచ్చు. తినడానికి రుచికరంగా, పుల్లగా టేస్టీగా ఉండే పచ్చిమామిడికాయ పులావ్ ను 20 నిముషాల్లో తయారుచేసేసుకోవచ్చు.

ఈ మ్యాంగో రైస్ రిసిపి కొద్దిగా పుల్ల మరియు వగరుగా ఉంటుంది. మరియు ఈ సమ్మర్ సీజన్ లో స్పెషల్ గా తయారుచేసుకొనే వంటల్లో మ్యాంగో పులావ్ ఒకటి. కాబట్టి, ట్యాంగీ టేస్ట్ ను మీరు ఎంజాయ్ చేయాలంటే, ఈ మ్యాంగో పులావ్ కు కావల్సిన పదార్థాలు, ఏవిధంగా తయారుచేయాలి తెలుసుకుందాం....

Exotic Green Mango Rice Pulav Recipe

కావల్సిన పదార్థాలు:
రైస్: 2cups(కుక్కర్లో వండి పెట్టుకొన్నది)
పచ్చిమామిడికాయ: 1(తురుమి పెట్టుకోవాలి)
వేరుశెనగపప్పులు: 3tbsp
పసుపు: 1/2tsp
ధనియాలపొడి: 1tsp
పెప్పర్ పౌడర్: 1tsp
నిమ్మరసం: 1tsp
కరివేపాకు: గుప్పెడు
ఆవాలు : 1tsp
ఎండుమిర్చి: 2
నీళ్ళు: 1/2cup
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. పాత్రలో కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
2. తర్వాత అందులోనే వేరుశెనగలు వేసి, మీడియం మంట మీద ఫ్రై చేసుకవోాలి.
3. ఇప్పుడు పసుపు, ధనియాలపొడి, పెప్పర్ పౌడర్, ఉప్పు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి.
4. పోపు వేగిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కూడా పోసి వేగించుకోవాలి.
5. 5నిముషాల తర్వాత మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం కూడా వేసి మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రామన్ని మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టాలి.
6. రెండు నిముషాల తర్వాత మూత తీసి కొద్దిగా నిమ్మరసం చిలకరించి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే గ్రీన్ మ్యాంగో రైస్ పులావ్ రిసిపి రెడీ.

English summary

Exotic Green Mango Rice Pulav Recipe

This mango rice recipe is tangy and a little sour to taste. Not many enjoy this delicious treat, but once in a way it is nice to have something tangy on our plate. In most homes, this raw mango rice is considered to be an exotic dish since mango is a seasonal fruit.
Story first published: Tuesday, May 19, 2015, 12:28 [IST]
Desktop Bottom Promotion