For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనీర్ పరోటా: టేస్టీ అండ్ ఫిల్లింగ్

|

పనీర్ లేదా టోప్ డైరీ ప్రొడక్ట్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, పాలను బాగా మరింగించి వెన్న తీసేసి పనీర్ ను తయారుచేస్తారు. వెజిటేరియ్ డైట్ లో నిరభ్యంతరంగా చేర్చుకోగలిగిన ఒక ఆహారం ఇది. పనీర్ తో సబ్జీ, స్నాక్స్ , మరియు ఇతర డిష్ లను కూడా టేస్టీగా తయారుచేస్తారు. పిల్లల కోసం తయారుచేసేటప్పుడు వీటిని ఎంపిక చేసుకోవచ్చు.

పనీర్ స్టఫింగ్ పరోటా చాలా సులభంగా తయారుచేయవచ్చు. ముఖ్యంగా పిల్లల పెరుగుదలకు మరియు అభివ్రుద్దికి బాగా సహాయపడుతుంది. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ పరోటో ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం...

Filling Paneer Parantha Recipe
కావల్సిన పదార్థాలు:
పన్నీర్ / కాటేజ్ చీజ్(తురుమినిది)-1cup
ఉల్లిపాయ(సన్నగా తరిగినవి)-1
కాప్సికం(సన్నగా తరిగినవి)-1
పచ్చిమిర్చి(సన్నగా తరిగినవి)-2
వెల్లుల్లి పేస్ట్ -1tsp (అవసరం అయితేనే)
పసుపు: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
గరం మసాలా ½ tsp
జీలకర్ర 1 tsp
నూనె - 2 tbsp

తయారుచేయు విధానం:
1. మైదా లేదా గోధము పిండిని, ఒక బౌల్లో వేసుకొని, కొద్దిగి ఉప్పు చిలకరించి అందులో నెయ్యి వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడక, అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ, మరియు క్యాప్సికమ్ ముక్కలు వేసి లైట్ గా వేగే వరకూ మీడియం మంట మీద వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులో ఉప్పు, గరం మసాలా, మరియు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. మసాలా మొత్తం వేగిన తర్వాత అందులో పన్నీర్ తురుము ను కూడా వేసి, బాగా మిక్స్ చేసి మసాల పట్టే వరకూ వేయించుకోవాలి.
4. ఇప్పుడు తవాను స్టౌ మీద పెట్టి, పిండినుండి కొద్దికొద్దిగా తీసుకిన చిన్న చిన్న బాల్స్ గా చేసి పరాటాలా వత్తుకోవాలి. తర్వాత పరాటాను తవా మీద వేసి, కొద్దిగా ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలి.
5. రెండు వైపులా రోస్ట్ చేసిన పరోటాలను ప్లేట్ లో వేసి, ముందుగా ఫ్రై చేసుకొన్నపనీర్ మసాలాను పరోటా మద్యలో వేసి, ఉల్లిపాయ తరుగును చిలకరించి మరియు టమోటో కెచప్ ను వేసి రోల్డ్ చేయాలి. అంతే పనీర్ పరోటా రెడీ. ఈ పనీర్ పరోటాను వేడి వేడిగా సర్వ్ చేయాలి.

English summary

Filling Paneer Parantha Recipe


 Paneer or tofu is a diary product that has many health benefits. If made with skimmed or low fat milk, paneer can be a healthy food that can be easily included in the diet. Vegetarians prefer adding this ingredient to many of the dishes.
Story first published: Friday, February 14, 2014, 12:14 [IST]
Desktop Bottom Promotion