For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిక్కుడు-బంగాళాదుంప కర్రీ

|

Flat Beans Potato Fry
కావలసిన పదార్థాలు:
చిక్కుడు: 1/4kg or 1cup
బంగాళ దుంప: 2
కారం: 1tsp లేదా మీ రుచికి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
పోపుకోసం:
లవంగాలు: 2
చెక్క: చిన్న ముక్క
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ఉద్దిపప్పు: 1tsp
ఎండుమిర్చి: 4-5
ఇంగువ: చిటికెడు
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళా దుంపలను కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి. అలాగే చిక్కుడు కాయలను రెండువైపుల తొనలు తీసి మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి.( కట్ చేసే ముందు చిక్కుడుకాయను అనపకాయ వలిచినట్లు వలిచి లోపల శుభ్రంగా ఉందో లేదా చూసుకోవాలి. కాయ ఎంత బాగున్నా కొన్నింటిలో పురుగు ఉంటుంది)
2. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి అందులో తగినంత ఉప్పు అందులో కట్ చేసి పెట్టుకొన్న బంగాళాదుంపలను వేసి మీడియంగా ఉడికించుకోవాలి. తర్వాత క్రిందికి దింపుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత మరో గిన్నెలో కొద్దిగా నీళ్ళు, ఉప్పు, కట్ చేసుకొన్న చిక్కుడు కాయలను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని, నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. (బంగాళదుంప, చిక్కుడు రెండూ ఒకే సారి ఉడికిస్తే, చిక్కుడు కాయా త్వరగా ఉడికి, బంగాళదుంప సగం కూడా ఉడకకుండా ఉంటుంది కాబట్టి రెండూ వేరు వేరుగా ఉడికించుకోవడం మంచిది.)
4. తర్వాత పాన్ లో నూనె వేసి, వేడయ్యాక పోపు దినుసులను ఒక దాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోవాలి.
5. పోపు దోరగా మారే సమయంలో బంగాళాదుంపల ముక్కలను యాడ్ చేయాలి. తర్వాత కారం, ఉప్పు చల్లి మరికొద్ది సేపు వేయించుకోవాలి.
6. అందులోనే ఉడికించి పెట్టుకొన్న చిక్కుడు కాయాలను కూడా కలుపుకొని ఫ్రై చేయాలి. రుచికి తగినట్లు ఉప్పు, కారంను అడ్జెస్ట్ చేసుకొంటూ మరో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసి క్రిందికి దింపుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి. అంతే బంగాళదుంప, చిక్కుడు ఫ్రై రెడీ

English summary

Flat Beans Potato Fry | ఫ్లాట్ బీన్స్-పొటాటో ప్రై


 Here is the most common way to prepare an Indian stir fry. Serve yard flat beans with potato with steamed rice or with chapati.
Story first published:Wednesday, July 18, 2012, 11:47 [IST]
Desktop Bottom Promotion