For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రైడ్ స్వీట్ కార్న్ రిసిపి: టేస్టీ అండ్ హెల్తీ..

|

కార్న్ (మొక్కజొన్న)తో కాల్చి లేదా ఉడికించి లేదా సూప్ చేసుకొని తింటుంటారు. శీతాకాలంలో హాట్ కార్న్ కోసం స్టాల్స్ చుట్టూ తిరుగుతుంటాం. మనలో చాలా మంది కార్న్ ను ఈవెనింగ్ స్నాక్ గా తింటుంటారు. అంతే కాదు మన ఇంటికి వచ్చిన మన ఫ్రెండ్స్ కూడా కాఫీ మరియు టీ తో పాటు హాట్ కార్న్ ను సర్వ్ చేస్తుంటాం.

కార్న్ మంచి స్నాక్ మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇందులో అధికంగా విటమిన్స్ ఉండి వ్యాధులు సోకకుండా కాపాడుతుంది. కార్న్ తో వివిధ వెరైటీ వంటలు తయారు చేసి తింటారు. కాబట్టి మనం కూడా ఓ మంచి వెరైటీ హాట్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రిసిపిని మన ఇంట్లో పిల్లలకు మరియు పెద్దలకు పరిచయం చేద్దాం...

Fried Sweet Corn Recipe

స్వీట్ కార్న్ - 1 full
చాట్ మసాలా - 1/2 teaspoon
కార్న్ ఫ్లోర్ - 1/2 teaspoon
ఉల్లిపాయలు - 1/2 cup (finely chopped)
పచ్చిమిర్చి - 4 to 5 (chopped)
ఉప్పు :రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడిచేయాలి.
2. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి . బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి . తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు కార్న్ సీడ్స్ ఒక ప్లేట్ లో తీసుకోవాలి. దాని మీద కార్న్ ఫ్లోర్ చిలకరించాలి.
4. తర్వాత ఈ స్వీట్ కార్న్ ను పాన్ లో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత ఛాట్ మసాలా చిలకరించాలి. 5 నిముషాల తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి మార్చుకోవాలి.
6. అంతే వేడి వేడిగా ఫ్రైడ్ స్వీట్ కార్న్ ను సర్వ్ చేయాలి.

English summary

Fried Sweet Corn Recipe

Sweet corn is a favourite food for one and all. There are amazing recipes that you can prepare with sweet corn; however, there is one recipe that everyone would love to munch on, irrespective of the time. You might have usually had the boiled sweet corn, which you can find nowadays at every eaterias possible.
Story first published:Friday, May 27, 2016, 11:58 [IST]
Desktop Bottom Promotion