For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చిమిరపకాయ తో ఊరగాయ

|

Green Chilli Pickle
గ్రీన్ చిల్లీ పికెల్ చాలా స్పైసీ గా ఉండే పికెల్. ఇది అన్ని రకాల భోజనంలోనికి తినగలిగినటు వంటి ఊరగాయ. సాధారణంగా ఇండియన్ ఫుడ్ అనగానే పక్కన ఏ ఊరగాయలేకుండా వంటలను వడ్డించరు. అలాగే భోజనం కూడా ఊరగాయ లేకుండా పూర్తి అవ్వదు. అన్ని ఊరగాయల్లో కంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. చాలా కారంగాను ఉంటుంది.

కావలసిన పదార్థాలు:
తాజాగా ఉండే పచ్చిమిరపకాయలు: 20(పొడవుగా పచ్చగా ఫ్రెష్ గా ఉండాలి)
ధనియాలు: 2tbsp
సోపు(సోంపు): 1tbsp
మెంతులు: 1tsp
ఉప్పు రుచికి సరిపడా
ఆమ్ చూర్ (మామిడికాయ పొడి): 1tbsp
పసుపు:1/2tsp
వెనిగర్: 1tbsp
ఆవాలు: 1tsp
నూనె తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిమిరప కాయలను మంచి నీళ్ళలో శుభ్రం చేసి, పొడి బట్టతో బాగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. తడి ఆరిన తర్వాత పచ్చిమిరపకాయను నిలువుగా ఒక సైడ్ లో కట్ చేసుకోవాలి.
2. తర్వాత ధనియాలు, సోపు, మెంతులు తీసుకొని వీటి గరుకుగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక పోపుకు వేయాల్సిన పదార్థాలు, గ్రైడ్ చేసుకొన్న పొడి అందులో వేసి దానికి వెనిగర్ చేర్చి బాగా మిక్స్ చేయాలి.
4. తర్వాత మద్యకు కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చిలో పోపుతో తయారు చేసి పెట్టుకొన్న పొడి మిశ్రమాన్ని నింపుకోవాలి.
5. ఇలా నింపుకొన్న పచ్చిమిర్చినీ గాజు జార్ లో వేసి మూత పెట్టి బయట ఎండలో ఒకటి లేదా రెండు రోజుల పాటు పెట్టాలి. తర్వాత దీన్ని ఇంట్లో కి తీసుకొచ్చి ఫ్రిజ్ లో కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక నెల పాటు తాజాగా ఉంటుంది. అంతే గ్రీన్ చిల్లి పికెల్ రెడీ.

English summary

Green Chilli Pickle | గ్రీన్ చిల్లీ పికెల్


 Chili pickle is a great way to spice up your food. Those who prefer mild levels of spicing might find this too hot. Chili Pickle is a great way to spice up any meal. Indian meals are generally served with different condiments of which pickles are the most common one. This is a rather hot and spicy pickle, not for the light hearted by any means.
Story first published:Tuesday, July 10, 2012, 12:41 [IST]
Desktop Bottom Promotion