For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ ట్రీట్: పెసరపప్పు ఆకుకూర కర్రీ

|

ఎల్లో దాల్(పెసరపప్పు) మన సౌత్ ఇండియాలో చాలా ఫేమస్. చాలా మంది ఈ ఎల్లో దాల్ తో పిచెడి, పకోడ, గ్రేవీ, పొంగల్ మొదలగుని తయారుచేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాదు మరింత రుచికరంగా ఉండటానికి ఇందులో మరికొన్ని వెజిటేబుల్స్ కూడా జోడిస్తుంటారు.

మూంగ్ దాల్(పెసరపప్పు)తో చాలా రకాల సాంబార్లు కూడా తయారుచేస్తారు. కానీ, ఈ రోజు హెల్తీ గ్రీన్ ట్రీట్ ను ఎలా తయారుచేయాలో...చాలా సింపుల్ పద్దతిలో వివరించడం జరిగినది. ఎల్లో మూంగ్ దాల్ స్పినాచ్ రిసిపిలో న్యూట్రీషియన్ విలువలు అధికంగా ఉన్నాయి. ఇది చాలా రుచికరమైనది మరియు తయారుచేయడం కూడా చలా సులభం. దీన్ని రైస్, తందూరి రోటికి సైడ్ డిష్ గా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది . మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం... READ MORE: ఆకుకూరల్లోని 13 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Green Treat: Moong Dal With Spinach Recipe

కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు - 1 cup
ఆకుకూర - 3 cups(మీకు నచ్చినది)
ఉల్లిపాయ- 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి- 4-5రెబ్బలు
అల్లం: 1 piece
పచ్చిమిర్చి- 5 (మద్యలోకి కట్ చేసుకోవాలి)
టమోటోలు- 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పసుపు- 1/2 tsp
జీలకర్ర - 1/2 tsp
గరం మసాలా- 1 tsp
కోకనట్ మిల్క్ - 3/4 cup
ఉప్పు: రుచికి సరిపడా
నూనె- 2 tbsp
ఇంగువ: చిటికెడు
నీళ్ళు- 2 cups

READ MORE: చర్మఛాయను మెరుగుపరిచే ఆకుకూరల రసం

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్లో కొద్దిగా నూనె వేసిన వేడి అయిన తర్వాత అందులో పోపుదినుసులు, ఇంగువ, పసుపు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
2. పోపు వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు కూడా వేసి కొద్దిమెత్తబడే వరకూ ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు అందులోనే పప్పు, నీళ్ళు, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని, మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
4. ఉడికిన తర్వాత మూత తీసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి.
5. ఇప్పుడు అందులో శుభ్రం చేసి, కట్ చేసి పెట్టుకొన్న ఆకుకూర, కొబ్బరి పాలు, లేదా క్రీమ్, కొద్దిగా గరం మసాలా వేసి ఉడికించుకోవాలి.
6. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కూడా మిక్స్ చేసి తిరిగి ఉడికించుకోవాలి.
7. ఆకుకూర మొత్తగా ఉడికేవరకూ 10నిముషాలుఉడికించుకొని తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఆకుకూర పెసరపప్పు రెడీ.

English summary

Green Treat: Moong Dal With Spinach Recipe

Green Treat: Moong Dal Moong dal is often prepared with vegetables in the form of sambhar. But, today we share with you a healthy green treat. This yellow moong dal with spinach is nutritional, delicious and very easy to prepare. The best thing about this simple dal recipe is the aroma which is mind-blowing.
Story first published: Thursday, June 11, 2015, 14:58 [IST]
Desktop Bottom Promotion