For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ వెజిటేరియన్ సలాడ్ రిసిపి :రంజాన్ స్పెషల్

|

రంజాన్ సెలబ్రేట్ చేసుకోవడానికి అతి కొద్ది రోజులు మాత్రమే ఉంది. రంజాన్ మాసంలో ముస్లీంలు చాలా కఠినమైన ఉపవాసదీక్షలు చేస్తారు. . ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి . . ఉపవాసం ఉండే సమయంలో ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది.

రంజాన్ మాసంలో ఎక్కువ నాన్ వెజ్ వంటలను వండుతారు.దాంతో హెల్తీగా మరియు యాక్టివ్ గా ఉంటారు. వీటితో పాటు హెల్తీ బెజిటేరియన్ సలాడ్స్ తీసుకోవడం వల్ల హెల్తీగా మరియు ఫిట్ గా ఉండవచ్చు. . దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు ఆరోగ్యం కూడా.

హెల్తీ వెజిటేరియన్ సలాడ్స్ తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల న్యూట్రీషియన్స్ అందుతాయి. ఇవి ఉపవాస సమయంలో చాలా అవసరమవుతాయి. ఈ హెల్తీ సలాడ్ రిసిపి డైట్ కాన్సియస్ ఉన్న వారు దీన్ని తప్పనిసరిగా తీసుకోవల్సిందే.. మరి ఈ హెల్తీ రిసిపి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

vegetarian recipe

కావల్సిన పదార్థాలు:
క్యారెట్ ముక్కలు- 1/2 cup
స్ప్రింగ్ ఆనియన్స్: 1/2 cup
టమోటోలు - 1/2 cup
కీరదోసకాయ - 1/2 cup
స్వీట్ కార్న్ - 1/2 cup
ఆరెంజ్ - 1/2 cup
వాటర్ మెలోన్ - 1/2 cup
ద్రాక్ష - 1/2 cup
మామిడిపండ్లు - 1/2 cup
పెప్పర్ - 1/2 teaspoon
నిమ్మరసం - 1 teaspoon
తేనె - 1/2 teaspoon
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో కీరదోసకాయ, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, స్వీట్ కార్న్ మరియు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
2. ఇప్పుడు, అందులో మిగిలిన ఫ్రూట్స్ అన్నీ వేసి , చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
3. తర్వాత, అందులో నిమ్మరసం మరియు ఫ్రూట్స్, మరియు వెజ్జీస్ వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా మిక్స్ చేసిన తర్వాతచివరగా కొద్దిగా తేనెను టాపింగ్ గా మిక్స్ చేసి సర్వ్ చేయాలి. అంతే ఈ రంజాన్ సమయంలో హెల్తీ ఫ్రూట్ సలాడ్ రెడీ..

English summary

Healthiest Salad Recipe For Ramzan

As you fast for Ramzan, it is important to have the right kind of food too. It is important that you have healthy food during the 2 meals since you're body would require a lot of energy during the fast. Generally, non-vegetarian foods are prepared during Ramzan, so as to keep oneself healthy and active.
Story first published:Saturday, July 2, 2016, 15:34 [IST]
Desktop Bottom Promotion