For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ పోహా రిసిపి : హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

పోహా(అటుకులు)తో తయారుచేసే వంటలు రోజులో ఎప్పుడైన తినవచ్చు . మీరు వీటిని బ్రేక్ ఫాస్ట్ గాను, స్నాక్ లేదా లంచ్ బాక్స్ కు గా తీసుకెళ్ళవచ్చు. ఇంకా బరువు తగ్గాలని కోరుకొనే వారికి పోహ ఒక ఉత్తమ ఎంపిక. మరింత హెల్తీగా ఉండాలంటే వైట్ రైస్ పోహా కన్నీ బ్రౌన్ రైస్ పోహాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

చాలా వరకూ మన భారతీయ ఇల్లలో పోహ ఒక ట్రెడిషినల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి . పోహాకు వివిధ రకాల పదార్థాలు జోడించి తయారుచేస్తారు . ఈ రోజు మీ పోహా రిసిపి మరింత స్పెషల్ గా ఉండటానికి బంగాళదుంపలను జోడించి తయారుచేసే విధానం తెలుపుతున్నాము . అందుకే దీన్ని ఆలూ పోహా లేదా పొటాటో పోహా అనిపిలుస్తారు . మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Healthy Aloo Poha Recipe For Breakfast

కావల్సిన పదార్థాలు:
పోహా (చదును బియ్యం): 2cups
ఆలూ (బంగాళాదుంపలు): 2(తరిగిన)
ఉల్లిపాయలు: 1 (సన్న ముక్కలుగా తరిగివి)
అల్లం పేస్ట్ : 1/2tsp
పచ్చి మిర్చి పేస్ట్ : 1tsp
పంచదార: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
నిమ్మకాయ : 1tbsp
ఆవాలు : 1tsp
హింగ్ (ఇంగువ): ఒక చిటికెడు
కొత్తిమీర తరుగు: 2tbsp
నూనె : 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పోహాను శుభ్రంగా కడిగి అదనపు నీరు తొలగించాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, మరియు ఇంగువ వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
3. ఆవాలు చిటపటలాడిన తర్వాత, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద వేగించుకోవాలి.
4. తర్వాత అల్లం, మరియు పచ్చిమిర్చి పేస్ట్ వేసి రెండు మూడు నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న పోహ, ఉప్పు, నిమ్మరసం మరియు పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి.
7. 5నిముషాలు మొత్తం మిశ్రమాన్ని ఉడికించి తర్వాత బంగాళదుంపలను వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
8. చివరగా కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఆలూ పోహా రెడీ. బ్రేక్ ఫాస్ట్ కు ఇది ఫర్ఫెక్ట్ రిసిపి

English summary

Healthy Aloo Poha Recipe For Breakfast


 Poha is one of the best things to eat at any time of the day. You can have it for breakfast, snack or even carry it in your lunchbox. Poha is especially a good option for all those who are trying to lose weight. To make it all the more healthy, you can use brown rice poha instead of the white one.
Story first published: Tuesday, October 21, 2014, 10:10 [IST]
Desktop Bottom Promotion