For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన హెల్తీ దిల్ హెర్బల్ రైస్ రిసిపి

|

సాధారణంగా రైస్ ఐటమ్స్ లో వివిధ రకాల వంటలను వండుకుంటుంటాము. అందులో పీస్ పులావ్, మేతీ పులావ్, కొన్ని రకాల ఫ్రైడ్ రైస్ లు మరియు మరికొన్ని ఇతర రైస్ ఐటమ్స్ తయారుచేసుకుంటుంటాము. ఇలాంటి రైస్ ఐటమ్స్ తయారుచేయడం సులభం మరియు పొట్టనిండిన అనుభూతి కలిగిస్తాయి.

కాబట్టి, ఈ రోజు మీకోసం ఒక సింపుల్ అండ్ డిఫరెంట్ పులావ్ రిసిపిని పరిచయం చేస్తున్నాము. దీన్ని దిల్ పులావ్ అంటారు. ఈ హెర్బల్ రెమెడీలో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉంటాయి. అదే విధంగా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి . దిల్ హెర్బ్ ను వివిధ రకాల వంటలకు కూడా ఉపయోగిస్తుంటారు .

ముఖ్యంగా డయాబెటిస్ 2కు ట్రీట్మెంట్ కు ఎక్కువగా వినియోస్తుంటారు. ఇది శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మరియు ఇన్సులిన్ లెవల్స్ పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. మరి ఇన్ని విలువైన ప్రయోజనాలున్న దిల్ హెర్బ్ తో పులావ్ ను ఎలా తయారుచేస్తారో చూద్దాం...

Healthy Dill Rice Recipe

కావల్సిన పదార్ధాలు:
దిల్ హెర్బ్ - 2 cups
రైస్ - 1 cup
అల్లం - 10 g
వెల్లుల్లి - 4 to 5 pieces
జీలకర్ర - 1/4th teaspoon
పసుపు - 1/4th teaspoon
పచ్చిమిర్చి - 4 to 5
ఉల్లిపాయలు - 1 cup
కొబ్బరినూనె - 1/2 cup
కొత్తిమీర - 4 to 5
ఆవాలు - 1/4th teaspoon
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసి తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం వేసి ఒక నిముషం వేగించుకోవాలి.

2. పోపు వేగేలోపు మిక్సీ జార్ లో కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, మరియు వెల్లుల్లి వేసి అవసరం అయితే కొద్దిగా నీళ్ళు జోడించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

3. ఇప్పుడు పోపు వేగుతున్న కుక్కర్లో డిల్ హెర్బ్ మరియు మిక్సీలో గ్రైండ్ చేసుకొన్న పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి.

4. అలాగే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొన్న కప్పు బియ్యం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి మిక్స్ చేయాలి.

5. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టాలి. విజిల్ పెట్టాలి.

6. మొత్తం మిశ్రమం ఉడికి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉండి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే దిల్ రైస్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Story first published:Friday, February 26, 2016, 17:33 [IST]
Desktop Bottom Promotion