For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హల్తీ మేతి పాలక్ బియ్యం రొట్టి: హెల్తీ అండ్ టేస్టీ ఈవెనింగ్ స్నాక్

|

బియ్యం రొట్టిని మీరు ఇదివరకే రుచి చూసి ఉంటారు. అయితే కొంచె వెరైటీగా...టేస్టీగా తయారుచేసుకుంటే మరింత టేస్ట్ గా ఉంటుంది. అక్కిరొట్టి(బియ్యం రొట్టి)కర్ణాటకాలో చాలా ఫేమస్ అయిన వంట. ఈ అక్కిరొట్టిలో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉంటాయి . ఇందులో గ్రీన్ లీవ్స్ మేతి మరియు పాలక్ చేర్చడం వల్ల మరింతి టేస్టీగా ఉంటుంది.

కొంత మందికి ఈ అక్కి రొట్టిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ఇష్టం మరికొందరికి మెయిన్ డిష్ గా ...ఇంకొందరికి స్నాక్ టైల్ లో తీసుకుంటారు. ఈ డిష్ ను ఏసమయంలో తీసుకొన్న సులభంగా జీర్ణం అవుతుంది. అక్కిరొట్టికి కాంబినేషన్ గా వివిద రకాల సైడ్ డిష్ లను కూడా తయారుచేసుకుంటారు. అయితే అక్కిరొట్టికి బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ . మరి టేస్టీ అండ్ హెల్తీ అక్కి రొట్టిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Healthy Methi Palak Akki Roti: Telugu Vantalu

కావల్సిన పదార్థాలు:
బియ్యం పిండి - 2 cups
మెంతి ఆకులు - 1 cup (chopped)
పాలకూర - 1 cup (chopped)
జీలకర్ర - 1tbs Grated
కొబ్బరి తురుము - 1 cup
పచ్చిమిర్చి - 2 to 3
కొత్తిమీర - 4 to 5 strands
నూనె - 2 tbs
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ఒక బౌల్ తీసుకొని అందులో మెంతి, పాలకూర ఆకులను శుభ్రం చేసి వేయాలి.
2. అందులోనే జీలకర్ర, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
3. మొత్తం మిశ్రమం కలగలిపిన తర్వాత అందులో బియ్యం పిండి వేసి మిక్స్ చేసుకోవాలి.
4. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి పాన్ మొత్తం సర్ధాలి .
6. తర్వాత చేతి నిండుగా పిండి తీసుకొని వేడిగా ఉన్న పాన్ మీద వేసి పాన్ మొత్తం పిండిని సర్ధాలి. తర్వాత చివర్ల నుండి నూనె చిలకరించాలి .
7. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని , స్టౌ ఆఫ్ చేయాలి. అంతే పాలక్ మేతి రోటి రెడీ. వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది.

English summary

Healthy Methi Palak Akki Roti: Telugu Vantalu

Healthy Methi Palak Akki Roti: Telugu Vantalu,oday, we shall learn to prepare one of the healthiest recipes around- methi palak akki roti. Akki roti is famous in Karnataka. This food is highly nutritious as it contains the green veggies, methi and palak.
Story first published: Friday, August 7, 2015, 15:38 [IST]
Desktop Bottom Promotion