For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెసరపప్పు స్వీట్ రిసిపి : శ్రావణ మాసం స్పెషల్

|

స్వీట్స్ లో పెసరపప్పు పాయసం గుడ్ ఆప్షన్ ఎందుకంటే ఇది చేయడం చాలా సులభం మరియు అతి త్వరగా రెడీ అయిపోతుంది. అంతే కాదు పెసరపప్పుతో తయారుచేసే స్వీట్ రిసిపిలో గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి . ఎవరైనా బాడీ హీట్ తో బాదపడుతున్నట్లైతే అలాంటి సమయంలో పెసరపప్పు బెల్లంతో తయారుచేసే స్వీట్ రిసిపిని అందిస్తే బాడీ హీట్ త్వరగా తగ్గుతుంది .

అంతే కాదు శ్రావణ మాసం ప్రారంభమైనది, ఈ సందర్భంగా ఇంట్లో రోజుకో స్వీట్ దేవుడికి నైవేద్యంగా కూడా పెడుతారు. కాబట్టి పెట్టే నైవేద్య ప్రసాదాల్లో ఈ మూగ్ దాల్ స్వీట్ రిసిపి ఒకటి. ఇది సాధారణంగా ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలలోని ఈ రుచికరమైన వంటకం పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి. అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పెసరపప్పు పాయసం మీ సొంతం.

Healthy Moong Dal Sweet Recipe

పెసరపప్పు: 2 cup
కొబ్బరి - 1 cup
బెల్లం - 1 cup
యాలకలు - 4 to 5
పాలు - 1
ఎండు ద్రాక్ష - 10
జీడిపప్పు - 10
నెయ్యి:- 5 tbsp

1. ప్రెజర్ కుక్కర్లో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో పెసరపప్పు వేసి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. . తర్వాత అందులో ఒక కప్పు పెసరపప్పుకు మూడు కప్పుల నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. మరో పాన్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలపాలి. బెల్లం కరిగే వరకూ కలియబెడుతుండాలి. ఈ బెల్లంను నీళ్ళను స్టౌ మీద పెట్టి కొద్ది సమయం ఉడికించి తర్వాత క్రింద దింపుకొని చల్లార్చుకోవాలి.
4. ఇప్పుడు మిక్సీలో కొబ్బరి తురుము మరియు యాలకలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. తర్వాత కుక్కర్ లో ఆవిరి తగ్గి చల్లబడిన తర్వాత మూత తీసి అందులో బెల్లం మిశ్రమం మరియు కొబ్బరి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి.
6. అలాగే ఇందులో రెండు కప్పుల పాలు పోసి మిక్స్ చేయాలి.
7. మరో చిన్న పాన్ లో నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో ఎండు ద్రాక్ష, జీడిపప్పు, వేగించుకొని తర్వాత పెసరపప్పు కుక్కర్ లో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అంతే హాట్ అండ్ టేస్టీ మూగ్ దాల్ స్వీట్ రిసిపి రెడీ.

English summary

Healthy Moong Dal Sweet Recipe: Telugu Vantalu

Healthy Moong Dal Sweet Recipe: Telugu Vantalu,Moong dal sweet recipe can be prepared in very less time. This sweet dish also has great health benefit. If any one is suffering from excess body heat then then can help indulge in this sweet recipe as the moong dal sweet reduces the body heat and cools it down.
Story first published: Thursday, August 13, 2015, 16:15 [IST]
Desktop Bottom Promotion